https://oktelugu.com/

కమెడియన్లు హీరోలెలా అవుతారు, కామెడీ కాకపోతే ?

కమెడియన్లు హీరోలు అవ్వడం ఆ నాటి రాజబాబు దగ్గర నుండి ఉంది. కానీ దురదృష్టం ఏమిటంటే.. హీరోగా మారిన కమెడియన్ చివరకూ కమెడియన్ గా కూడా పనికిరాకుండా పోతున్నాడు. ఇప్పటి జనరేషన్ కి పాత తరం వారి గురించి అర్ధం కాదు కాబట్టి.. అర్ధమయేలా చెప్పాలంటే సునీల్ కెరీర్ ను తీసుకోవచ్చు. మంచి కమెడియన్ గా ఒకప్పుడు తిరుగులేకుండా ఒక వెలుగు వెలిగిపోతున్న క్రమంలో ‘అందాల రాముడు’ అంటూ హీరో అయ్యాడు. ఆ తరువాత కూడా హీరోగా […]

Written By: , Updated On : May 1, 2021 / 02:37 PM IST
Follow us on

Tollywoodకమెడియన్లు హీరోలు అవ్వడం ఆ నాటి రాజబాబు దగ్గర నుండి ఉంది. కానీ దురదృష్టం ఏమిటంటే.. హీరోగా మారిన కమెడియన్ చివరకూ కమెడియన్ గా కూడా పనికిరాకుండా పోతున్నాడు. ఇప్పటి జనరేషన్ కి పాత తరం వారి గురించి అర్ధం కాదు కాబట్టి.. అర్ధమయేలా చెప్పాలంటే సునీల్ కెరీర్ ను తీసుకోవచ్చు. మంచి కమెడియన్ గా ఒకప్పుడు తిరుగులేకుండా ఒక వెలుగు వెలిగిపోతున్న క్రమంలో ‘అందాల రాముడు’ అంటూ హీరో అయ్యాడు.

ఆ తరువాత కూడా హీరోగా నానాకష్టాలు పడినా.. ప్రస్తుతం కమెడియన్ గా కూడా అవకాశాలు రావడం లేదు సునీల్ కి. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడితో ఓ సూపర్ హిట్ సినిమా చేసిన తరువాత కూడా, సునీల్ ను హీరోగా అంగీకరించలేకపోయారు ప్రేక్షుకులు. సునీల్ పరిస్థితి చూసి కూడా.. మిగిలిన కమెడియన్లు హీరో అవ్వడానికి నానాతిప్పలు పడుతుండటం చూస్తే.. హీరో అనే పిలుపులో ఎంత మోజు ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయినా టాలీవుడ్ లో కమెడియన్లుగా తమను తామూ ప్రూవ్ చేసుకున్న వెంటనే.. అసలు హీరోలుగా ఎందుకు మారిపోతున్నారు. హీరోలుగా ట్రయ్ చేసి నిలదొక్కుకోలేక, ఆ పై కమెడియన్లుగానూ చాన్స్ లు సంపాదించలేక ఇబ్బందులు పడుతున్న వారు ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో చాలామందే ఉన్నారు కదా. మరి ఎందుకో కమెడియన్లకు ఇప్పటికీ తత్వం బోధపడట్లేదు. మంచి కమెడియన్ గా ప్రూవ్ చేసుకోగానే హీరోగా మారిపోవాలనే ఆలోచన రావడం,

దానికి తగ్గటుగానే హీరోల డేట్లు దక్కించుకోలేని నిర్మాతలందరూ కమెడియన్ల వెంట పడటం కామన్ అయిపోయింది. ఇక కమెడియన్ సత్య మంచి కమెడియన్, అతను కూడా హీరో పాత్రల వైపు ప్రస్తుతం ఆసక్తి చూపిస్తున్నాడు. ఆల్ రెడీ హీరో సందీప్ కిషన్ బ్యానర్ లో ‘వివాహ భోజనంబు’ అనే క్యాచీ టైటిల్ లో సత్య హీరోగా రాబోతున్నాడు. మరి ఇతను కూడా సునీల్ లాగే అయిపోతాడో.. లేక హీరో అనిపించుకుంటాడో చూడాలి.