https://oktelugu.com/

Krishna Vamsi: కృష్ణవంశీ ఒక్క సంవత్సరం లో 1000 సార్లు చూసిన సినిమా ఏంటో తెలుసా..?

నిజానికి కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ మన ఇండస్ట్రీలో మరొకరు లేరనే చెప్పాలి. ఆయన సినిమాలో నటిస్తే చాలు నటుడు మళ్లీ పుడుతాడు అని చిరంజీవి లాంటి ఒక గొప్ప నటుడు చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..

Written By:
  • Gopi
  • , Updated On : March 14, 2024 / 12:10 PM IST

    Which movie Krishna Vamsi watched 1000 times in one year

    Follow us on

    Krishna Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న కృష్ణవంశీ ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఆయన చేసిన సినిమాలు ఒకప్పుడు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా చాలామంది హీరోలని కూడా స్టార్ హీరోలుగా మార్చాడు. ముఖ్యంగా ఆయన నాగార్జున లాంటి హీరోకి నిన్నే పెళ్ళాడుతా లాంటి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ తో సినిమా చేసి తనలో ఇలాంటి ఒక యాంగిల్ కూడా ఉందని జనానికి తెలిసేలా చేశాడు.

    నిజానికి కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ మన ఇండస్ట్రీలో మరొకరు లేరనే చెప్పాలి. ఆయన సినిమాలో నటిస్తే చాలు నటుడు మళ్లీ పుడుతాడు అని చిరంజీవి లాంటి ఒక గొప్ప నటుడు చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.. అంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన సినిమాల కంటే కూడా ఈయన సినిమాలో చేస్తే నటుడిగా వాళ్ళ జర్నీ అనేది కొత్త స్టైల్ లో సాగుతుందని చిరంజీవి గారు చెప్పారు అంటే కృష్ణ వంశీ గారి దర్శకత్వ ప్రతిభ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు… నిజానికి చిరంజీవి కృష్ణవంశీ డైరెక్షన్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ రామ్ చరణ్ తో కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా సమయంలో చిరంజీవి కూడా చాలావరకు దగ్గరుండి అన్ని చూసుకుంటూ ముందుకు సాగాడు.

    అయితే వీళ్ళ కాంబోలో కూడా ఒక సినిమా రావాల్సింది కానీ అది అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. కృష్ణవంశీలో ఉన్న డైరెక్షన్ కెపాసిటీ చిరంజీవికి తెలుసు కాబట్టి ఆయన రామ్ చరణ్ ని కృష్ణవంశీ కి అప్పజెప్పి ఆయనతో ఒక సినిమా చేయించాడు. ఇక ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా దాంట్లో రామ్ చరణ్ మాత్రం చాలా అద్భుతంగా నటించాడనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ఇంత మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ ఇండస్ట్రీకి రావడానికి ఆయనను ఇంప్రెస్ చేసింది మాత్రం కృష్ణగారట.

    ఆయన చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని ఒక సంవత్సరంలోనే వెయ్యి సార్లు చూసి ఇన్స్పైర్ అవ్వడమే కాకుండా మనం కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్లి సినిమాలు చేయాలని చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడట. ఇక దానివల్లే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ గా మారి సినిమాలను తీయడమే కాకుండా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కూడా చాలా సంవత్సరాల పాటు కొనసాగారు…