Prabhas: హీరో ఆరడుగుల హైట్ తో ఎవడినైనా సరే కొత్తగలడు అనే ఒక కాన్ఫిడెంట్ తో ఉన్నప్పుడే వాళ్ళను హీరోలుగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక హీరో అనే పదానికి నిలువెత్తు రూపం ప్రభాస్…ఇప్పటికీ ఆయన అంటే పడి చచ్చిపోయే అభిమానులు కోట్లలో ఉన్నారు. బాహుబలి సినిమాతో ఇండస్ట్రీని సైతం శాసించిన ఆయన ప్రస్తుతం నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆ బాలీవుడ్ స్టార్ హీరో యొక్క అభిమానులు భయంతో వణికిపోతున్నారు. కారణం ఏంటి అంటే రీసెంట్ గా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి ఒక వాయిస్ ఓవరైతే రిలీజ్ చేశారు. ఇక అందులో ‘ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్’ అంటూ ప్రభాస్ కి ఒక ట్యాగ్ వేశారు. దాంతో షారుఖ్ ఖాన్ అభిమానులు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. కొంత మంది ప్రభాస్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ఏంటి? అంటూ వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేశారు…ప్రభాస్ కి షారుక్ ఖాన్ కి మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది.
అందువల్లే ప్రభాస్ హీరోగా ఒక సినిమా వస్తుందంటే చాలు షారుఖాన్ అభిమానుల్లో టెన్షన్ భయం మొదలవుతున్నాయి. ఇక 2026 సంక్రాంతికి ‘రాజాసాబ్’ సినిమాతో వస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది.
తద్వారా ఆయనకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది దాన్ని బట్టి ప్రభాస్ యొక్క మార్కెట్ మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ విషయాలను తెలుసుకున్న షారూక్ ఖాన్ అభిమానులు మాత్రం ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారట. కారణమేంటి అంటే సక్సెస్ అయితే వాళ్ళ హీరో కంటే ముందుకు దూసుకెళ్తాడు.
కాబట్టి తనని ఎదిగాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్లు అలా కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండియాలో ప్రభాస్ అభిమానులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ప్రభాస్ సినిమాలు చూసి ఆ మూవీ ని సూపర్ సక్సెస్ చేస్తారట. ఇక ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు…చూడాలి మరి ప్రభాస్ ఇక మీదట చేసే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అనేది…