Tollywood Young Directors: సీనియర్ హీరోలు యంగ్ డైరెక్టర్లకు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? పాత డైరెక్టర్లంటే కోపమా?

కుర్రాళ్లు ఎప్పుడు కుర్రాళ్లే. వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అందుకే ఈ జనరేషన్ మేకర్స్ తో పని చేయడం ఎవరికైనా ఆసక్తిగా ఉంటుంది. పాత చింతకాయ పచ్చడి ఎంత రుచిగా ఉన్నా బర్గర్ నే ఇష్టపడుతారన్నట్టు..

Written By: Suresh, Updated On : October 17, 2023 3:18 pm

Tollywood Young Directors

Follow us on

Tollywood Young Directors: యంగ్ డైరెక్టర్ల ఆలోచనలు కొత్తగా ఉంటాయి. వారి ఆలోచనలు ఈ జనరేషన్ కు తగ్గట్టుగా ఉంటాయి. కానీ పాత డైరెక్టర్లకు అనుభవం ఎక్కువగా ఉంటుంది. ఒక స్టోరీని తెరపైకి ఎక్కించడంలో పాత డైరెక్టర్లు విఫలం అవరు. కానీ కొత్తవారి వద్ద జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం మాత్రం స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లతో పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఓ సారి లుక్ వేసేయండి…

కుర్రాళ్లు ఎప్పుడు కుర్రాళ్లే. వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అందుకే ఈ జనరేషన్ మేకర్స్ తో పని చేయడం ఎవరికైనా ఆసక్తిగా ఉంటుంది. పాత చింతకాయ పచ్చడి ఎంత రుచిగా ఉన్నా బర్గర్ నే ఇష్టపడుతారన్నట్టు.. వాళ్లతో సినిమా కొత్త ధనం ఉంటుందని భావిస్తున్నారట కొందరు. వాళ్లతో సినిమాలు చేయడం వల్ల మార్కెట్ మరింత పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారట. మరి ఇందులో నిజం ఎంత అనేది చూసేద్దాం…

ఇన్నోవేటివ్ ఐడియాలు, మేకింగ్ నెక్ట్స్ లెవల్, ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా కొత్త డైరెక్టర్లు రావడంతో వారి మేకింగ్ కు ఫిదా అయిపోతున్నారు సీనియర్ హీరోలు. రీసెంట్ గా వచ్చిన సైంధవ సినిమా టీజర్ చూస్తే ఈ విషయం మరింత క్లియర్ గా అర్థం అవుతుంది. మామూలుగా వెంకీ సినిమాపై ఉండే అంచనాల కంటే సైంధవ్‌పై డబుల్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయంటే దానికి డైరెక్టర్ శైలేష్ కొలను అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా మేకింగ్ కొత్తగా ఉంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఏ దర్శకుడు చూపించని విధంగా ప్రజెంట్ చేసారు శైలేష్ కొలను.

ఇక బాలయ్య అంటే ఊరమాస్, క్లాస్ అన్ని కలగలుపుకొని ఉంటాయి. కానీ భగవంత్ కేసరిపై మరింత అంచనాలు పెరిగాయి. అందుకే మామూలుగా ఉండే మార్కెట్ కంటే దీనికి డబుల్ బిజినెస్ జరిగింది. బాలయ్య యాక్షన్ కు అనిల్ రావిపూడి డైరెక్షన్ తోడయ్యే సరికి సినిమా రేంజ్ పెరిగిపోయిందని టాక్. అయితే బాలయ్యకు కుర్ర దర్శకులు బాగానే కలిసొస్తున్నారు. వీరసింహారెడ్డిలో బాలయ్యను పవర్ ఫుల్‌గా చూపించారు గోపీచంద్ మలినేని. అలాగే ఇప్పుడు అనిల్ సైతం నటసింహాన్ని నెవర్ బిఫోర్ కారెక్టర్‌లో చూపించబోతున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు తమిళంలో లోకేష్ కనరాజ్, నెల్సన్ లాంటి యంగ్ డైరెక్టర్స్ హవా కనిపిస్తుంది. వాళ్ల మేకింగ్‌తోనే విక్రమ్, జైలర్ అన్ని వందల కోట్లు వసూలు చేసాయి. ఇలా కొత్త సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకోవడానికి ప్రధాన కారణం యంగ్ డైరెక్టర్లే అని ఇండస్ట్రీలో టాక్. కానీ పాత డైరెక్టర్లు ఏకంగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ వాళ్లను చిన్న చూపు చూడలేం. ఎవరి టాలెంట్ వారిది అంటున్నారు మరికొందరు.