Senior Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళ ఇమేజ్ ని బేస్ చేసుకొని దర్శకుల చేత కథలు రాయించుకొని అవే సినిమాల్లో నటిస్తూ సక్సెస్ లను అందుకుంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి కొత్త కథలు ఏమీ రావడం లేదు దాంతో వచ్చిన కథలనే తిప్పి తిప్పి పిప్పి చేసి మరీ అవే సినిమాలు తీస్తూ ముందుకు సాగుతూ వెళ్తున్నారు.
అందువల్లే మన తెలుగు లో కొత్త కాన్సెప్ట్ లు ఏమి రావట్లేదు అంటూ అప్పట్లో బాలీవుడ్ నుంచి గాని, తమిళ్ ఇండస్ట్రీ నుంచి గాని భారీ విమర్శలు వస్తుండేది. కానీ ఇప్పుడు యంగ్ దర్శకులు వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే మన సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు చాలా సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తూ వస్తున్నారు. కానీ వీళ్ళకి ఇంతవరకు ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదు. కారణం ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు ఒక సెక్యూర్ జోన్ లో ఉంటూ సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. అందుకే వీళ్లేవ్వరికి అవార్డులు రాలేదు.
ఇక తమిళ్ ఇండస్ట్రీలో కమలహాసన్ లాంటి నటుడు చాలా మంచి క్యారెక్టర్లను ఎంచుకొని అందులో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి చాలా అవార్డులను గెలుచుకున్నాడు. కానీ మన దగ్గర మాత్రం మన సీనియర్ హీరోలు అప్పట్లోనే అవార్డు గెలుచుకోలేదు, ఇక ఇప్పుడు సినిమాలు చేస్తున్న కూడా వాళ్ళకి అవార్డులు రావడం లేదు. ఇక మలయాళం ఇండస్ట్రీలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి నటులు వైవిధ్య భరితమైన పాత్రలు ఎంచుకుంటూ నటనలో వైవిధ్యాన్ని కనబరచడమే కాకుండా సినిమా సినిమాకి వేరియేషన్ ని చూపిస్తూ వాళ్ల నటనలో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో మన హీరోలు మాత్రం ఎప్పుడు ఒకే ఫార్మాట్ లో సినిమాలు చేస్తున్నారు.
యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలు చెప్పినప్పటికీ అవి చేయడానికి మన హీరోలు భయపడిపోతున్నారు. మన హీరోల అంతిమ టార్గెట్ సినిమా సక్సెస్ అవ్వడం, దాని వల్ల వాళ్ళకి పేరు రావడం, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే దాని వల్ల చాలా మంది నష్టపోతారనే ఒకే ఒక ఉద్దేశ్యం తో సక్సెస్ ఫార్ములాని నమ్ముకొని దాని వెంటే పరిగెడుతున్నారు. అదే ఇప్పుడు వీళ్లకు పెద్ద మైనస్ పాయింట్ గా మారింది.ప్రతి ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు అందరూ డిఫరెంట్ సినిమాలు చేసి మంచి విజయాలను అందుకోవడమే కాకుండా అవార్డులను కూడా గెలుచుకుంటున్నారు. మరి మన సీనియర్ హీరోలు ఇప్పటికైనా మంచి సినిమాలు చేసి మోహన్ లాల్, మమ్ముట్టి, కమలహాసన్ ల మాదిరిగా నేషనల్ అవార్డ్ లను గెలుచుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…