Tollywood Movies: మీరు ఎప్పుడైనా ఈ సినిమాల పేర్లు గమనించారా? దిల్, దిల్ సే, హార్ట్ ఎటాక్, గుండెజారి గల్లంతయిందే, గుండెచప్పుడు… ఇలా ఎన్నో రకాల సినిమాల పేర్లు శరీరంలోని గుండె పై మాత్రమే పెట్టారు. మిగతా అవయవాల పేర్లు ఎక్కడ కనిపించవు. వాస్తవానికి గుండె రక్తాన్ని పంపిణీ చేసే ఆర్గాన్. మరి అలాంటప్పుడు గుండె పేరు ఎందుకు పెట్టారు? ప్రతి మనిషిలో ఎమోషన్ మెదడులో ఉంటుంది.. మరి గుండెలో ఎమోషన్ ఉంటుందా? అసలు ఎందుకు ఇలా పెడతారు?
కొందరు వైద్యులు చెబుతున్న ప్రకారం ఎమోషన్ మెదడులోనే ఉంటుంది. కానీ మెదడులోనే ఎమోషన్ ఉంటుంది అన్న విషయం ఎవరు పూర్తిగా నిర్ధారించలేదు. ఎందుకంటే దీనిని చాలామంది పుస్తకాల ద్వారా మాత్రమే తెలుసుకున్నారు. మానవ శరీరంలోని ప్రతి అవయవం ఎమోషన్ ను కలిగి ఉంటుంది. ఒక వస్తువును పైకి లేపాలంటే చేతు ముందుకు వస్తుంది.. చెప్పులు తొడుక్కోవడానికి కాళ్లు ముందరికి వస్తాయి.. ఎవరైనా బాధపడితే కన్నీళ్లు వస్తాయి.. ఇలా ప్రతి అవయంలో ఏదో రకమైన ఎమోషన్ ఉంటుంది. అయితే అన్నిటిని సమ్మేళనం చేసే అవయం గుండె గా పేర్కొంటారు. అంటే రక్తం గుండె ద్వారానే మిగతా అవయవాల్లోకి వెళ్తుంది. గుండె నిరంతరం కొట్టుకుంటేనే మనిషి బతకగలుగుతాడు. ఆ గుండె ఒక్క క్షణం ఆగిపోతే మనిషి మరణిస్తాడు.
అందువల్ల శరీరంలో ప్రధానమైన అవయం గా గుండెను పేర్కొంటారు. అంతేకాకుండా ఒక మనిషి కష్టాలు, సుఖాలు అన్నీ కూడా గుండెతోనే ముడిపడి ఉంటాయని చెబుతారు. ఎందుకంటే గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల ఆ మనిషిలో ఎమోషన్ వస్తుంది. నార్మల్ గా ఉండడం వల్ల సంతోషం వస్తుంది. ఇలా అన్ని రకాల ఫీలింగ్స్ కు హార్ట్ అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే ఈ హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కనుక.. ముఖ్యమైన లవ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ వంటి సినిమాలకు గుండె పేరు ను పెడతారు.
గుండె లేదా హార్ట్ అనే పదం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పేరు ఉంటే సినిమా ఎమోషన్ ఉంటుందని చాలామంది ఆసక్తి చూపిస్తారు. అందుకే ఈ పేరు తో కలిగిన సినిమాలను తీస్తారు. గుండె తప్ప శరీరంలోని మిగతా అవయవాలకు ఎమోషన్స్ తక్కువగా ఉంటాయి. అంటే ఒక మనిషి ఫీలింగ్స్ అనేది గుండెతోనే ఉంటుంది. అందుకే ఈ పేరును నిర్ణయిస్తారు. అంతేకాకుండా గుండె పేరుతో ఉన్న సినిమాలు చాలావరకు సక్సెస్ కూడా అయ్యాయి. ఎమోషన్ కలిగిన సినిమాలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలామంది డైరెక్టర్లు ఈ పేరును ఎంచుకుంటారు.