Success: ఒక విద్యార్థి రాత్రి పడుకునేటప్పుడు ఇలా అనుకుంటాడు.. రేపు ఉదయం 4 గంటలకు నిద్రలేవాలి.. మూడు చాప్టర్లు చదవాలి. గంటకు ఒక చాప్టర్ చొప్పున ఏడు గంటల వరకు చదువుకోవాలి.. అని అనుకుంటాడు. అయితే ఉదయం నిద్ర లేవడానికి అలారంను ఏర్పాటు చేసుకుంటాడు. ఇలా అలారం పెట్టుకుని ఉదయం 4 గంటలకు అలారం మోగగానే.. ఆ విద్యార్థి వెంటనే అలారం ఆఫ్ చేస్తాడు. అలా 8 గంటల వరకు నిద్రపోతాడు.. ఆ తర్వాత ఇప్పుడు ఎలా చదివేది? అని అనుకొని సమయం గడిచిపోతుందని స్కూల్ లేదా కాలేజీకి వెళ్తాడు.. ఇలా విద్యార్థి మాత్రమే కాకుండా చాలామంది నేటి యువత చేస్తున్న పని. ఒక పనిని అనుకొని దానిని సక్రమంగా నిర్వహించుకోలేకపోవడంతో ఎంతోమంది సాధించాలని అనుకునేవారు ఉన్నచోటే ఉంటున్నారు. అసలు ఏదైనా సాధించాలంటే ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి?
జీవితంలో విజయం సాధించాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు. వారు అలా చేరుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కొన్ని సౌకర్యాలు.. ఆ సౌకర్యాలలో మొదటిది ఉదయం నిద్ర లేవడం. నేటి కాలంలో చాలామంది సూర్యోదయం అయితే గాని మెలకువ రాదు. అలా చేస్తే ఎప్పటికీ అనుకున్నది సాధించలేరు. ఎందుకంటే సూర్యుడు రాకముందే మనం నిద్రలేస్తే అనుకున్నది సాధించడానికి చిన్న దారి పడుతుంది. అంటే ఉదయం 4 గంటలకు లేచి అలవాటు చేసుకోవాలి. ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు ఉదయం నాలుగు గంటలకు లేవాలని అనుకొని.. అలారం మోగగానే వెంటనే ఉలిక్కిపడి.. గబగబా మొహం కడుక్కొని చదువుకోవడం లేదా తాను చేసే కార్యక్రమం చేయడమో లాంటి అలవాటు ఉన్నవారు.. కచ్చితంగా విజయం సాధించే తీరుతారు. ఎందుకంటే శరీరంలో సాధించాలని పట్టుదల ఉంటే నిద్రపై మమకారం ఉండదు. అంతేకాకుండా నిద్రలోనూ తాను సాధించే దాని గురించే ఎప్పటికీ ఆలోచిస్తూ ఉంటాడు.
గతంలో ఉన్న మేధావుల గురించి తెలుసుకున్నాం.. ఇప్పుడున్న మేధావులను చూస్తున్నాం.. వీరంతా ఊరికే తమ జీవితంలో విజయాలు సాధించలేదు. ఎన్నో కష్టాలను పడితే కానీ వారు గమ్యాన్ని చేరుకోలేదు. వాటిలో ప్రధానమైనది ఉదయం నిద్ర లేవడం. సూర్యోదయానికి ముందే నిద్రలేచే అలవాటు ఉన్నవారు ప్రతిరోజు తన పనిని సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. అంతేకాకుండా తన లక్ష్యం కోసం నిరంతరం కష్టపడే శక్తి అతనికి వస్తుంది. సూర్యోదయం రాకముందు ప్రశాంతమైన వాతావరణముంటుంది. ఈ సమయంలో ఏ వ్యక్తి అయినా నిద్రలేస్తే తనకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఆరోజు ఏం చేయాలో ముందే ప్రణాళిక కూడా వేసుకుంటాడు.
ఇలా ప్రతిరోజు ప్రణాళిక ప్రకారం గా ముందుకు వెళుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. వాటిని తట్టుకుంటూ విజయం సాధిస్తాడు. అలా సాధించిన విజయం ఎప్పటికీ ఉండిపోతుంది. మరి మీరు కూడా ఇలాంటి విజయం సాధించాలంటే ముందుగా సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.