Allu Arjun-Rajamouli: అల్లు అర్జున్ రాజమౌళి కాంబో లో సినిమా ఎందుకు రావడం లేదు… దానికి కారణం ఏంటంటే..?

ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకోవాలని వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో తన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోవాలనే...

Written By: Gopi, Updated On : May 16, 2024 5:02 pm

Why Allu Arjun Rajamouli combo movie is not coming

Follow us on

Allu Arjun-Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి..ఆయన తెలుగులో చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఇప్పటివరకు 100% సక్సెస్ శాతం ఉన్న ఏకైక దర్శకుడిగా కూడా రాజమౌళి నే కావడం విశేషం… ఇక ఇండియాలోనే ఈయన లాంటి సక్సెస్ పర్సంటేజ్ ఉన్న దర్శకుడు మరొకరు లేరు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇది ఇలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకోవాలని వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో తన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోవాలనే ఉద్దేశ్యం తోనే రాజమౌళి ఈ ప్రాజెక్టు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రాజమౌళి ఈ సినిమా చేయడం వల్ల తెలుగు సినిమా ఖ్యాతి అనేది ప్రపంచ స్థాయిలో ఎలివేట్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు.

ఒక్క పవన్ కళ్యాణ్ ని మినహాయిస్తే ఈ జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ వస్తున్న రాజమౌళి అల్లు అర్జున్ తో కూడా ఇప్పటివరకు సినిమా చేయలేకపోయాడు. ఇక దానికి గల కారణం ఏంటి అంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదిక చాలాసార్లు రాజమౌళిని రిక్వెస్ట్ కూడా చేశారు. ఇక అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయండి అని ఆయన అభిమానులు రాజమౌళిని సోషల్ మీడియా వేదిక గా రిక్వెస్ట్ చేసిన కూడా ఆయన అల్లు అర్జున్ ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక నిజానికి బాహుబలి తర్వాత అజిత్, అల్లు అర్జున్ లను పెట్టి రాజమౌళి ఒక సినిమా చేయాలనుకున్నాడు. కానీ అది స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది. ఇక దానివల్ల ‘త్రిబుల్ ఆర్’ సినిమాని తెరపైకి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం కూడా ఉంది అంటూ మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…