Mammootty: టర్బో తో మమ్ముట్టి మరో హిట్ కొట్టబోతున్నాడా..? ఆయన ఒక్కడికే ఇది ఎలా సాధ్యం అవుతోంది..?

ఒక సినిమాకి మరొక సినిమాకి మధ్య చాలా వేరియేషన్స్ ఉండే విధంగా తన లైనప్ ను ఏర్పాటు చేసుకొని వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక మొత్తానికైతే మమ్ముట్టి వరుసగా 'కన్నూరు స్క్వాడ్', 'బ్రమయుగం '

Written By: Gopi, Updated On : May 16, 2024 5:08 pm

mammootty turbo

Follow us on

Mammootty: మలయాళ సినిమా ఇండస్ట్రీలో మమ్ముట్టి లాంటి నటుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన వైవిద్య భరితమైన సినిమాలు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు చేయలేదనే చెప్పాలి. ఇక మలయాళం ఇండస్ట్రీ అనే కాకుండా దేశం లోనే సీనియర్ హీరోలు ఎవరు కూడా మమ్ముట్టి చేసినన్ని వైవిధ్యభరితమైన పాత్రలు అయితే పోషించలేకపోతున్నారు.

ఆయన ఒక సినిమాకి మరొక సినిమాకి మధ్య చాలా వేరియేషన్స్ ఉండే విధంగా తన లైనప్ ను ఏర్పాటు చేసుకొని వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక మొత్తానికైతే మమ్ముట్టి వరుసగా ‘కన్నూరు స్క్వాడ్’, ‘బ్రమయుగం ‘ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇప్పుడు ‘టర్బో ‘ అనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇది మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయింది.

ఇక మొన్నటిదాకా డీసెంట్ ఫిలిమ్స్ ని చేసిన ఆయన ఇప్పుడు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని నిరూపించుకోవడానికి ఈ టర్బో సినిమాని చేసినట్టుగా తెలుస్తుంది. కన్నురు స్క్వాడ్ సినిమాని కనక తీసుకున్నట్టయితే ఈ సినిమా లో ఒక క్రైమ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పట్టుకోడానికి సినిమా మొత్తం నడుస్తుంది. ఇక కేరళ నుంచి నేపాల్ వరకు ట్రావెల్ చేసి ఇక మొత్తానికైతే చివర్లో వాళ్ళని పట్టుకుంటాడు. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించిన మమ్ముట్టి ఆ తర్వాత బ్రమయుగం సినిమాలో ఇప్పటివరకు ఎవరు పోషించిన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించాడు.

ఇక సినిమా సినిమాకి మధ్య తను చూపించే వేరియేషన్స్ చూస్తున్న ప్రతి హీరోకి కూడా మతి పోతుందనే చెప్పాలి. ఇక ఈయన లాగా ప్రతి హీరో కూడా వేరియేషన్స్ ను చూపిస్తూ సినిమాలను కనక చేసినట్లయితే ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో చాలా సినిమాలు ఇండస్ట్రీ లోకి వస్తాయని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…