Prasanth Varma: ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలనుంది అని చెప్పిన తెలుగు స్టార్ హీరో…

రీసెంట్ గా సంక్రాంతి కానుక గా వచ్చిన హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సాలిడ్ హిట్టును దక్కించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

Written By: Gopi, Updated On : May 16, 2024 4:57 pm

Telugu star hero wants to do a film with Prasanth Varma

Follow us on

Prasanth Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోలుగా పేరు సంపాదించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుక గా వచ్చిన హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సాలిడ్ హిట్టును దక్కించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం హనుమాన్ సినిమాకి సిక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దాంతోపాటు బాలీవుడ్ లో రన్వీర్ సింగ్ తో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ తో సినిమా చేయాలని ఉందని ఒక స్టార్ హీరో హింట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరు అంటే ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రామ్ పోతినేని…ప్రస్తుతం రామ్ డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక చేయాలని ఉందని రామ్ తన సన్నిహిత వర్గాల దగ్గర తెలియజేస్తున్నట్టుగా సమాచారమైతే అందుతుంది. నిజానికి రామ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ప్రశాంత్ వర్మ చాలా మంచి హై వోల్టేజ్ కథనైతే రూపొందించగలడు. కానీ రామ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా రావాలన్న కూడా దానికి మరో రెండు సంవత్సరాల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా అయిపోయిన తర్వాత రన్వీర్ సింగ్ తో చేసే సినిమాని పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత రామ్ తో సినిమా చేస్తే చేయచ్చు. నిజానికి ప్రశాంత్ వర్మ తన దగ్గర కథ ఉండి చేయాలనుకుంటే చేస్తాడు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్ వేషన్ ను బట్టి తను రామ్ తో సినిమా చేసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే రామ్ లాంటి యంగ్ హీరోతో సినిమా చేస్తే ప్రశాంత్ వర్మ కు కూడా చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయని మరి కొంతమంది సినిమా పండితులు కూడా వాళ్లభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…