https://oktelugu.com/

Chandrababu: చంద్రబాబు టీడీపీని కుప్పంలో గట్టెక్కిస్తారా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పంలో ఓటమి తరువాత పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని విజయపథంలో నడిపించాలని తాపత్రయ పడుతున్నారు. ఇందులో భాగంగా పలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కానీ కుప్పంలో ఓటమి తరువాత పార్టీ వెంట నడిచేందుకు నేతలు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వ్యూహంలో భాగంగానే టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలనే సంకల్పంతోనే చంద్రబాబు ఓటమికి బాటలు వేసినట్లు తెలుస్తోంది. కుప్పంలో ఓటమికి […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 9, 2021 / 03:10 PM IST
    Follow us on

    Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పంలో ఓటమి తరువాత పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని విజయపథంలో నడిపించాలని తాపత్రయ పడుతున్నారు. ఇందులో భాగంగా పలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కానీ కుప్పంలో ఓటమి తరువాత పార్టీ వెంట నడిచేందుకు నేతలు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వ్యూహంలో భాగంగానే టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలనే సంకల్పంతోనే చంద్రబాబు ఓటమికి బాటలు వేసినట్లు తెలుస్తోంది.

    Chandrababu

    కుప్పంలో ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టమ్ నిర్వహించారు. అక్కడే ఉండి తన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీని నిలువరించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తల్లో మనోబలం నింపేందుకు సిద్ధమవుతున్నారు. నాయకత్వంలో మార్పుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. పార్టీ కేడర్ లో ధైర్యం నింపే పనిలో పడ్డారు. కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు రెడీ అయినట్లు సమాచారం.

    ప్రజలతో మమేకమై వారిలోనే ఉంటూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కేడర్ ను పెంచుకుని సమస్యల పరిష్కారానికి పాటుపడాలని చూస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే తీరుగా వ్యవహరిస్తామని చెప్పేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజల బాగోగులు చూడాలని తాపత్రయడుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Andhra Pradesh: ఏపీ భవిష్యత్ ప్రశ్నార్థకం.. రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీకి అక్కర్లేదా?

    సొంత నియోజకవర్గంలో పట్టు విడవకుండా విక్రమార్కుడిలా నిలబడి వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు నిర్ణయంతో కార్యకర్తలు కూడా అధినేత వెంటే ఉంటూ ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు ప్రణాళికలు ఏ మేరకు ఫలిస్తాయోననే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. ఇప్పటికే ఓటమి దిగులుతో ఉన్న టీడీపీని గట్టెక్కిస్తారో లేదో చూడాల్సిందే.

    Also Read: KA Paul: కేఏ పాల్‌ తీరే వేరప్పా!

    Tags