https://oktelugu.com/

Music Directors: ఈ సంవత్సరం ఈ ముగ్గురిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తేలాబోతుందా..?

దేవిశ్రీప్రసాద్ పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాని చాటుకున్నాడు. ఇక దానికి తోడుగా తమన్ కూడా ఈ సంవత్సరం 'గుంటూరు కారం' సినిమాతో తన మ్యూజిక్ లోని పవర్ ని చూపించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 12, 2024 / 10:10 AM IST

    Who will be the top music director among these three

    Follow us on

    Music Directors: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ వాళ్లలో కొంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చి ఇండస్ట్రీ లో క్లిక్ అవుతున్నారు. ఇక అందులో దేవిశ్రీప్రసాద్, తమన్, అనిరుధ్ వీళ్ళు ముగ్గురి మధ్య గట్టి పోటీ అయితే నడుస్తుంది. ఒక సినిమా సక్సెస్ లో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే ఒక సినిమా కోసం సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోవడానికే డైరెక్టర్లు ఎక్కువ ప్రాధాన్యత ను ఇస్తు ఉంటారు.

    ఇక అందులో భాగంగానే ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాని చాటుకున్నాడు. ఇక దానికి తోడుగా తమన్ కూడా ఈ సంవత్సరం ‘గుంటూరు కారం’ సినిమాతో తన మ్యూజిక్ లోని పవర్ ని చూపించాడు. ఇక అనిరుధ్ అయితే విక్రమ్ నుంచి తన హవా ను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇక గత సంవత్సరం జైలర్ సినిమాతో అనిరుధ్ పాన్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసాడు. ఇక వీళ్ళు ముగ్గురి సినిమాలు ఈ సంవత్సరంలో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నాయి.

    కాబట్టి వీళ్ళ ముగ్గురిలో ఎవరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఈ సంవత్సరం తేలబోతుంది. దేవిశ్రీప్రసాద్ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే, తమన్ మాత్రం గేమ్ చేంజర్, ఓజీ సినిమాలతో ఈ సంవత్సరం తన సత్తా చాటాబోతున్నాడు. అలాగే అనిరుధ్ దేవర సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లలో ఎవరు ప్రేక్షకులను వాళ్ల మ్యూజిక్ తో మెప్పించి నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

    ఇక వీళ్లలో ఎవరు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుకున్న కూడా ముగ్గురు సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడం విశేషం…వీళ్లు కనుక ఈసారి తమ మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటే పాన్ ఇండియాలో వీళ్ళని మించిన మ్యూజిక్ డైరెక్టర్లు మరెవరు లేరు అనేది మరొకసారి ప్రూవ్ అవుతుంది…