Credit Card Tips: ప్రస్తుతం కాలంలో Credit Card వాడకం పెరిగిపోయింది. మినిమం ఆదాయం ఉన్నా కొన్ని బ్యాంకులు ఖాతాదారులకు ఈ కార్డులను అందిస్తున్నాయి. వస్తుసేవలను ఉపయోగించుకునేందుకు ముందుగానే డబ్బు అందించే ఈ కార్డుల వల్ల ఎంతో ఉపయోగం ఉంది. అయితే దీనిని జాగ్రత్తగా వాడుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం అదనంగా వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిని వాడుకొమ్మని మీకు తెలిసి వారికి లేదా మీ స్నేహితుడికి వాడుకొమ్మని ఇస్తున్నారా? ఇలా చేస్తే 800 శాతం అదనంగా టాక్స్ కట్టాల్సి వస్తుంది. అదెలాగంటే?
చాల మంది క్రెడిట్ కార్డు ఉంటే జేబులో లక్ష రూపాయలు ఉన్నట్లేనని భావిస్తారు. దీంతో తమ అవసరాలతో పాటు ఇతరుల అవసరాలు తీర్చడానికి కార్డును ఇస్తుంటారు. అత్యవసర సమయంలో ఆదుకోవడంలో తప్పు లేదు. కానీ విలాసాలకు వాడుకోవడానికి మీ క్రెడిట్ కార్డును ఇతరులకు ఇవ్వడాన్ని నిరాకరించండి. ఎందుకంటే మీ క్రెడిట్ కార్డుపై ట్రాన్జాక్షన్ పెరిగితే ఇన్ కం టాక్స్ వాళ్లు ఇంటికి నోటీసులు పంపించే ప్రమాదం ఉంది.
ఒక వ్యక్తికి ఏడాదికి 6 లక్షల ఆదాయం వస్తుందనుకోండి. ఈ వ్యక్తికి వివిధ రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు ఆదాయాన్ని బట్టి , ట్రాన్జాక్షన్ ను బట్టి లిమిట్ పెంచుకుంటూ పోతాయి. ఈ క్రమంలో కొందరు అవసరం లేకున్నా స్థాయికి మించి క్రెడిట్ కార్డుపై వస్తువులు కొంటారు. అంతేకాకుండా తమ స్నేహితులు వాడుకోవడానికి అవకాశం ఇస్తారు. ఒక సంత్సరంలో వ్యక్తికి వచ్చే రూ.6 లక్షల ఆదాయం కంటే ఎక్కువగా ఈ కార్డుపై ఖర్చు పెడితే ఇన్ కం ట్యాక్స్ వాళ్లు అబ్జర్వర్లో పెడుతారు. ఇదిలాగే కొనసాగితే ఆదాయానికి మించి ఎలా ఖర్చు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని నోటీసులు పంపుతారు.
ఈ నోటీసులకు స్పందించకున్నా.. వీటిపై సమాధానం ఇవ్వలేకపోయినా.. 800 రెట్టింపు ఫైన్ విధిస్తారు. దీంతో క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఎలాంటి ట్రాన్జాక్షన్ జరపకపోయినా ఫెనాల్టీ కట్టే ప్రమాదం ఉంది. అందువల్ల వచ్చే ఆదాయం లోపల క్రెడిట్ కార్డును వాడే విధంగా చూసుకోండి. అంతేకాకుండా మీ స్నేహితుడు క్రెడిట్ కార్డు అడిగితే సున్నితంగా తిరస్కరించండి. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు.