Bigg Boss 6 Telugu Nominations: తెలుగు ప్రేక్షకులు ప్రతి ఏడాది బుల్లితెర లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఎంతలా ఎదురు చూస్తారో మన అందరికి తెలిసిందే..ఇప్పటి వరుకు 5 సీసన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీసన్ లోకి దిగ్విజయంగా అడుగుపెట్టింది..ఆరవ సీసన్ మొదటి రోజు నుండే ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది..ఈ ఆరవ సీసన్ లో 21 కంటెస్టెంట్స్ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్ళు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు..కానీ వీళ్ళు ఆడుతున్న ఆట తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు పెద్ద సెలెబ్రిటీలుగా మారి బయటకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి..అయితే ఈ 6 వ సీసన్ ప్రారంభం అయ్యి అప్పుడే వారం రోజులు అయిపోయింది..ఒక కంటెస్టెంట్ హౌస్ ని వదిలి కచ్చితంగా బయటకి వెళ్లాల్సిందే..అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లే కంటెస్టెంట్ ఎవరో తేలిపోయింది.

మొదటి వారం లో ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయినా ఇంటి సభ్యులు ఫైమా, రేవంత్, శ్రీ సత్య, ఇనాయ సుల్తానా,చలాకి చంటి ,అభినయ మరియు ఆరోహి..వీరిలో అందరికంటే అత్యధిక ఓట్లతో రేవంత్ మొదటి స్థానం లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది..రేవంత్ గొప్ప సింగర్..ఆయనకీ ఈ స్థాయి ఓట్లు వస్తాయి అనేది అందరూ ఊహించిందే..కానీ జబర్దస్త్ ఆర్టిస్టు ఫైమా అతని తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన కంటెస్టెంట్ గా రెండవ స్థానం లో కొనసాగడమే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం..ఇక మూడవ స్థానం లో సాయి సత్య,నాల్గవ స్థానం లో చలాకి చంటి మరియు 5 స్థానం లో ఆరోహి రావు కొనసాగుతున్నారు..ఇక అభినయ శ్రీ మరియు ఇనాయ సుల్తానా 6 మరియు 7 వ స్థానం లో ఉన్నట్టు సమాచారం.

వీళ్లిద్దరి మధ్య ఓట్ల తేడా కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నారు అనేది చెప్పడం కష్టం గా మారింది..ప్రస్తుతానికి అయితే ఇనాయ సుల్తానా ఆఖరి స్థానం లో కొనసాగుతుంది..పోలింగ్ ముగిసే సమయానికి ఇది మారొచ్చు..అయితే అభినయ శ్రీ మరియు ఇనాయ సుల్తానా లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అని మాత్రం తెలిసిపోయింది..చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్ నుండి బయటకి వెళ్ళబోతున్నారు అనేది.