Uday Kiran : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక అందులో భాగంగానే చాలా మంచి కథలతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న ఈ స్టార్ హీరోలు ఇప్పుడు యావత్ ఇండియానే ఏలుతుండటం విశేషం… ఇక ఇదిలా ఉంటే వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచడమే కాకుండా వాళ్లకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటూ ముందుకుసాగడం అనేది ప్రతి ఒక్కరిని ఆనందానికి గురిచేస్తుంది. అయితే ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరికంటే ముందే ఒక స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుకొని వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకొని టాప్ హీరో రేంజ్ కి వెళ్తాడు అనుకున్న సందర్భంలోనే ఆయన జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆయన కెరియర్ అనేది అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే ఉదయ్ కిరణ్… నిజానికి ఉదయ్ కిరణ్ ని చిరంజీవి ఎదగకుండా చేశాడు అని చాలామంది అంటారు కానీ అది ముమ్మటికి వాస్తవం కాదు. ఒక టాప్ ప్రొడ్యూసర్ తన కొడుకు ఎదుగుదలకి ఈ హీరో అడ్డుపడతారేమో అనే ఉద్దేశ్యంతోనే అతన్ని అప్పట్లో తొక్కేసాడని కొన్ని వార్తలైతే ఎక్కువగా వినిపించాయి. నిజానికి సై, అతడు, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు, బన్నీ, రెడీ ఈ సినిమాలన్నీ ఉదయ్ కిరణ్ చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ టాప్ ప్రొడ్యూసర్ ఈ హీరోని తొక్కేయడంతో ఈ సినిమాలు మొత్తం అతనికి దూరమయ్యాయి. తద్వారా ఆయనకి కెరియర్ అనేది లేకుండా చేశారు.
ఇక మొత్తానికైతే ఆయన చాలా సంవత్సరాల పాటు ఫ్రెష్టేషన్ లో ఉండి చివరికి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇక మొత్తానికైతే ఆయన ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడనే చెప్పాలి. ఆయన లాంటి నటుడు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
చాలా అమాయకమైన ఫేస్ తో ఎలాంటి ప్రేక్షకులనైన ఆకట్టుకునే నటనను ప్రదర్శిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక ఆ ప్రొడ్యూసర్ చేసిన పనికి చిరంజీవి ఉదయ్ కిరణ్ తొక్కేశాడని చాలామంది అనుకున్నారు. కానీ అది ముమ్మాటికి అబద్ధం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉదయ్ కిరణ్ మన మధ్య లేడు కాబట్టి ఆయన మీద చాలా రకాల రూమర్లు అయితే వచ్చాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఉదయ్ కిరణ్ మరణం అనేది ఒక పీడ కల లా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని అప్పుడప్పుడు కలిచి వేస్తూ ఉంటుంది. ఇక ఆయన మరణ వార్త విన్న తర్వాత చాలామంది సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారనే చెప్పాలి…