Bank Loan: ఆదాయం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి ఎక్కువగానూ… మరికొందరికి తక్కువగానూ ఉంటుంది. కానీ ఖర్చులు, అవసరాలు మాత్రం అందరికీ ఒకేలాగా ఉంటాయి. ఇటువంటి సమయంలో కొందరు కొన్ని అవసరాల కోసం డబ్బును ఇతరుల వద్ద అప్పుగా తీసుకోవాల్సి వస్తుంది. వ్యక్తుల వద్ద అప్పుగా తీసుకున్న డబ్బుకు వడ్డీ ఎక్కువ. అందుకే నేటి కాలంలో చాలా మంది బ్యాంకు రుణం తీసుకుంటున్నారు. ఒకప్పుడు బ్యాంకు లోన్ రావాలంటే అతి కష్టం ఉండేది. సరైన ధ్రువ పత్రాలు ఉండి.. ఆదాయం ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మినిమం డాక్యుమెంట్స్ సమర్పిస్తే లోన్ వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ లోన్ విషయంలో Reseve Bank Of India(RBI) బ్యాంకు వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు క్షణంలో లోన్ తీసుకోవచ్చు.. అదెలాగంటే?
కాలం మారుతున్న కొద్దీ బ్యాంకు లోన్ ప్రాసెస్ ఈజీగా మారుతుంది. ఇప్పుడు బ్యాంకు లోన్ ఇచ్చేవారు రోజుల తరబడి తిప్పించుకోవడం లేదు. అంతా ఆన్ లైన్ చేసి గంటల్లో లోన్ మంజూరు చేస్తున్నారు. ఒక వ్యక్తికి లోన్ కావాలంటే ఆ వ్యక్తి గురించిన సమాచారం అంతా ఆన్ లైన్ లో ఉండడంతో వారి గురించి, వారి సిబిల్ స్కోర్ గురించి వెంటనే తెలుసుకొని లోన్ వస్తుందా? లేదా? అనేది చెప్పేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా బ్యాంకుకు కూడా వెళ్లకుండా లోన్ తీసుకునే సౌకర్యాన్ని ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ULT. దీని గురించి వివరాల్లోకి వెళితే..
Unified Rending Interface (ULI) ను ఆర్బీఐ ఆగస్టులో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కింద అన్ని బ్యాంకులు పనిచేస్తాయని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న Upi తరహాలోనే ఇందులో కూడా బ్యాంకులు అన్నీ ఒకే చోట ఉంటాయి. ఏ బ్యాంకు సర్వీసు కావాలన్నా అందులో నుంచి వాడుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంకు లోన్ కావాలంటే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందులోకి వెళ్లిన తరువాత ఫోన్ నెంబర్ తో లింక్ అయిన బ్యాంకులు కనిపిస్తాయి. ఇందులో ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి. ఆ తరువాత కావాల్సిన బ్యాంకును సెలెక్ట్ చేసుకొని లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా బ్యాంకులు లోన్ ఎలా ఇస్తాయి? అనే సందేహం రావొచ్చు. దీనికి పరిష్కారమేంటంటే? ఈ యాప్ ఇన్ స్టార్ చేసే సేమయంలో పర్మిషన్ అడుగుతుంది. మొబైల్ కాంటాక్ట్ తో పాటు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్న ఆధార్, పాన్ కార్డుల వివరాలు బ్యాంకులు అందించడానికి పర్మిషన్ అడుగుతుంది. ఈ సమయంలో అలో అని క్లిక్ చేయడం వల్ల ఫోన్ నెంబర్ పై ఉన్న సమాచారం అంతా బ్యాంకులకు వెళ్తుంది. ఆ తరువాత ఏ బ్యాంకును అయితే సెలెక్ట్ చేసుకుంటారో.. అప్పుడు ఆ బ్యాంకు వారు లోన్ దరఖాస్తును పరిశీలించి వెంటనే లోన్ మంజూరు చేస్తారు. ఒకవేళ లోన్ కు అనర్హులు అయితే.. ఆ విషయాన్ని కూడా వెంటనే చెప్పేస్తారు.