Nagarjuna’s elder brother son Aditya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలన్నీ వాళ్లకు మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమాలను చేయలేకపోతున్నారు. ఒకప్పుడు లెజెండరీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగేశ్వరరావు వారసులు పాన్ ఇండియాలో తమ ఐడెంటిటిని నిలుపుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక నాగేశ్వరరావు (Nageshwara Rao) తర్వాత నాగార్జున (Nagarjuna) అక్కినేని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తూ న్నాడు. ప్రస్తుత నాగార్జున 65 సంవత్సరాల పైబడిన వయసులో కూడా డిఫరెంట్ పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తన కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ సైతం స్టార్ హీరోలుగా రాణించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇక నాగేశ్వరరావు పెద్దకొడుకు అయిన అక్కినేని వెంకట్ కొడుకు ఆదిత్య (Adhithya) సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రాలేదు అనే దానిమీదనే పలు రకాల వార్తలయితే వస్తున్నాయి.
నిజానికి నాగార్జున అన్న వెంకట్ తన కొడుకు అయిన ఆదిత్య ను సినిమా ఇండస్ట్రీలో హీరోగా పరిచయం చేయాలనుకున్నాడు. కానీ ఆదిత్య మాత్రం తనకు సినిమాలంటే ఇష్టం లేదని తను ఒక కార్ రేసర్ అవ్వాలనుకుంటున్నానని వెంకట్ తో చెప్పడంతో వెంకట ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడట…కొంతవరకు ఆదిత్య మీద సీరియస్ అయ్యారట.
దాంతో నాగార్జున వాళ్ళ విషయంలో జోక్యం చేసుకొని పిల్లలకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళను ఆ రంగంలోకి పంపించడమే ఉత్తమం అని వెంకట కి చెప్పి నాగార్జున ఆదిత్యను ఎంకరేజ్ చేశాడట. ఇక ఆయన రేసర్ గా పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున వాళ్ళ అన్న అయిన వెంకట్ హీరో అవ్వలేదు. తన కొడుకు కూడా హీరో అవ్వకపోవడంతో నాగార్జున కావాలనే వెంకట్ కొడుకుని హీరోగా రానివ్వడం లేదంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికి అందులో ఏ మాత్రం నిజం లేదంటూ అక్కినేని వెంకట్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ అయితే ఇచ్చాడు…ఇప్పటికి నాగార్జున తను అందరం కలిసే ఉంటున్నాం అని చెప్పాడు…