https://oktelugu.com/

Anushka: అనుష్క సినిమా కెరియర్ ను నాశనం చేసింది ఎవరు..? ఆమె సినిమాలను ఎందుకు లైట్ గా తీసుకుంటుంది…

Anushka: రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ గుర్తింపును కూడా తెచ్చుకుంది. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సబ్జెక్టులను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే అనుష్క మాత్రం అసలు సినిమాలేమి లేకుండా ఖాళీగా ఎందుకు ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : July 11, 2024 / 11:29 AM IST

    Who ruined Anushka film career

    Follow us on

    Anushka: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ అనేది చాలా తక్కువ రోజులు ఉంటుంది. హీరోలతో పోల్చుకుంటే వాళ్ల స్టార్ డమ్ గానీ, క్రేజ్ గాని తక్కువే ఉంటుంది. హీరోయిన్లు మహా అయితే 5 నుంచి 10 సంవత్సరాల వరకు మాత్రమే ఇండస్ట్రీ లో కొనసాగుతారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం హీరోలతో పాటు సరి సమానంగా స్టార్ డమ్ ని సంపాదించుకొని దాదాపు 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. ఇక అలాంటి వాళ్లలో అనుష్క ఒకరు. హీరోల తో పాటు పోటీ పడి నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసి ఇండస్ట్రీ లో సూపర్ హిట్లను కూడా సాధించింది.

    ఇక రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ గుర్తింపును కూడా తెచ్చుకుంది. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సబ్జెక్టులను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే అనుష్క మాత్రం అసలు సినిమాలేమి లేకుండా ఖాళీగా ఎందుకు ఉంటుంది. ఆమె సినిమా కెరియర్ నాశనం అవ్వడానికి గల కారణం ఏంటి అనే డౌట్ మనలో కలుగుతుంటాయి. ఇక నిజానికి అనుష్క బాహుబలి సినిమా సమయంలోనే ‘సైజ్ జీరో’ అనే ఒక సినిమా చేసింది. ఇక ఈ సినిమాకి రాఘవేంద్రరావు కొడుకు ‘ప్రకాష్ ‘ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం ఆమె విపరీతంగా లావు అయిపోయింది. ఆ తర్వాత డైట్ చేసిన కూడా మళ్లీ ఆమె నార్మల్ పొజిషన్ కి రాలేకపోతుంది. దానివల్ల బాహుబలి 2 సినిమా షూటింగ్ సమయంలో కూడా రాజమౌళికి విపరీతమైన ఇబ్బందులు ఎదురయ్యాయి.

    దానివల్లే అనుష్క చేయాల్సిన కొన్ని షాట్స్ ను గ్రాఫిక్స్ లో తెరకెక్కించినట్లు కూడా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. దానివల్లే ఆమె కొన్ని షాట్స్ లో లావు గా మరికొన్ని షాట్స్ లో సన్నగా కనిపిస్తుంది. ఇక మొత్తానికైతే సైజ్ జీరో సినిమా వల్లే అనుష్క కెరీర్ అనేది భారీగా నష్టపోయింది. ఇక ఈ సినిమా సక్సెస్ ని కూడా సాధించలేదు. ఆ ఒక్క సినిమా కోసమే లావైన అనుష్క అటు సక్సెస్ లా పరంగా వెనుకబడిపోయింది. ఇటు ఆఫర్ల పరంగా కూడా తను సరైన అవకాశాలను అందుకోలేక పోతుంది. ఇక ప్రస్తుతం ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నప్పటికీ సరైన సబ్జెక్టులు మాత్రం దొరకడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. తను కనుక సైజ్ జీరో అనే సినిమాని చేయకుండా ఉండుంటే ఇప్పటికీ కూడా ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ స్టార్ హీరోల పక్కన అవకాశాలను అందుకునేది.

    త్రిష నయనతార లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ వాళ్ళు ఇంకా కూడా స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా చేస్తున్నారు. ఇక ఆ హీరోయిన్ల తో పోలిస్తే అనుష్క చాలా వరకు బెటర్ క్రేజ్ పరంగా చూసిన అనుష్కకి చాలా పాపులారిటీ ఉంది. అయినప్పటికీ తను తన సినిమా కెరియర్ ను అనవసరంగా నాశనం చేసుకుందనే చెప్పాలి. ఇక సైజ్ జీరో తర్వాత నుంచి అనుష్క సినిమాలను లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక నాగార్జున తో చేసిన ‘ సూపర్ ‘ సినిమా నుంచి ‘బాహుబలి ‘ సినిమా వరకు ఆమెకి తిరుగు ఎవ్వరు లేరు అనేంతలా మంచి గుర్తింపును తెచ్చుకుంటు ముందుకు సాగింది. మరి ఇప్పటికైన తను కొన్ని మంచి సబ్జెక్టులతో వచ్చి సక్సెస్ అందుకుంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…