Who is War2 Movie Villain: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి ప్రతి హీరో కూడా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మాత్రం గొప్ప సినిమాలను చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన వరుసగా ఏడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు… ఎవరికి సాధ్యం కానీ రీతిలో ఇలాంటి గొప్ప రికార్డును సాధించిన హీరో కూడా తనే కావడం విశేషం…మరి ‘వార్ 2’ సినిమాతో మరోసారి గొప్ప విజయాన్ని అందుకొని తన ఖాతాలో ఎనిమిదోవ సక్సెస్ ని వేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాలో విలన్ ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలయితే వస్తున్నాయి.
మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా కనిపిస్తారట. ఇక సెకండాఫ్ లో హృతిక్ రోషన్ పాత్రలో కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇద్దరు హీరోలే, ఇద్దరు విలన్లే అనే ధోరణిలో సినిమా యూనిట్ నుంచి ఒక కొత్త వార్త అయితే బయటికి వచ్చింది.
ఈ ఈవెంట్ లో సందడి చేస్తున్న ఈ స్టార్ హీరోలు వాళ్ళ అభిమానులను అలరిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గతంలో రామ్ చరణ్ తో కలిసి ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
లాంగ్ రన్ లో ఆ సినిమా 1300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో చేస్తున్న వార్ 2 సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదుగుతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు తన మార్కెట్ ను కోల్పోయే అవకాశాలైతే ఉన్నాయి…