Venkatesh And Balakrishna: ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో భారీ గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు… ఇక పాన్ ఇండియాలో ప్రస్తుతం మన హీరోలు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే.
Also Read: ‘కుబేర’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కొత్త సినిమాలను కూడా డామినేట్ చేసిందిగా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఆయనకు ఒక గొప్ప గుర్తింపుని తీసుకొచ్చిందే కావడం విశేషం. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న త్రివిక్రమ్ సినిమా మీదే ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే గతంలో ఆయనకి ఒక స్టార్ డైరెక్టర్ కథ వినిపించారట. ఇక వెంకటేష్ (Venkatesh) ఆ సినిమా చేయడానికి సిద్ధమైనప్పటికి ఆయన మళ్లీ వేరే హీరోతో ఆ సినిమా చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే బోయపాటి శ్రీనుగా తెలుస్తోంది. బోయపాటి వెంకటేష్ తో తులసి సినిమా చేశాడు. ఆ వెంటనే ఆయనతో మరొక సినిమా చేయాలని అనుకున్నప్పటికి వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. కానీ ఆలోపే అతనికి బాలకృష్ణ నుంచి అవకాశం రావడంతో బాలయ్య బాబుని కలిసి అతనితో ‘సింహా’ సినిమా చేశాడు.
నిజానికైతే ఈ సినిమాని వెంకటేష్ తో చేయాల్సిందట. కానీ అనుకోని కారణాల వల్ల బాలయ్య తో చేయాల్సి వచ్చింది. మొత్తానికైతే ఈ సినిమాతో బాలయ్య – బోయపాటి కాంబినేషన్ కి మంచి గుర్తింపు రావడమే కాకుండా వాళ్ళ కాంబినేషన్లో ఇప్పుడు నాలుగో సినిమా కూడా రాబోతుంది.
వరుసగా వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇకమీదట ఎలాంటి సినిమాలు చేస్తాడు మరి బాలయ్య బాబుతో ఇప్పుడు చేస్తున్న అఖండ 2 సినిమాతో మరోసారి తనకు భారీ విజయాన్ని అందించి నాలుగో విజయాన్ని కూడా అతని ఖాతాలో వేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపు రావడమే కాకుండా బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ గా నిరూపించుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో కాకుండా బాలయ్య బాబుతో సినిమా చేసి బాలయ్య బాబుకి భారీ సక్సెస్ ని అందించి తను కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్న దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…