Chiranjeevi And Kamal Haasan: ఇప్పటివరకు ఇండియాలో ఎవరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు…ఆయన చేసిన సినిమాలు ఆయనను తారా స్థాయిలో నిల్చొబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాలుగా ఏక చత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్క నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)… ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒక మూస ధోరణిలో వెళుతున్న సినిమా ఇండస్ట్రీని తన డాన్సులతో, ఫైట్లతో తెర మీద కొత్తగా ఆవిష్కరించి సినిమా అంటే ఎలా ఉండాలి అనేది ప్రేక్షకులకు తెలియజేసిన నటుడు కూడా తనే కావడం విశేషం…అప్పట్లో ఒక వైపు చిరంజీవి సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Hasan) లాంటి నటులు భారీ విజయాలను సాధిస్తూ తెలుగులో కూడా వాళ్ళ సినిమాలను రిలీజ్ చేసి ఇక్కడ కూడా పెను ప్రభంజనాలను సృష్టిస్తూ వచ్చారు. కమలహాసన్ లాంటి హీరో లోకనాయకుడిగా ఎదగడానికి మన తెలుగు దర్శకులు కూడా చాలా కీలకపాత్ర వహించారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చిరంజీవి చేసిన అన్ని సినిమాల్లో కమల్ హాసన్ కి ఒక సినిమా అసలు నచ్చలేదట…
Also Read: ‘కుబేర’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కొత్త సినిమాలను కూడా డామినేట్ చేసిందిగా!
ఆ సినిమా ఏంటి అంటే గుణశేఖర్ (Gunashekar) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన మృగరాజు (Mrugaraju) సినిమా కమల్ హాసన్ కి నచ్చలేదట. ఈ సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉన్నప్పటికి కంటెంట్ లో చాలా వరకు మిస్టేక్స్ ఉండడం చిరంజీవి వాటిని పట్టించుకోపోవడం వల్లే ఆ సినిమా అలా అయిందని ఆయన చెప్పాడు.
అలా కాకుండా ఆ మూవీ మీద కనక కొంచెం కేర్ తీసుకొని ఉంటే సినిమా బాగుండేది. కానీ ఓవరాల్ గా ఆ సినిమా చూస్తున్నంత సేపు తనకు పెద్దగా నచ్చలేదట. ఈ విషయాన్ని చిరంజీవితో కూడా చెప్పినట్టుగా తను ఒకానొక సందర్భంలో తెలియచేశాడు. మరి ఏది ఏమైనా కూడా లోకనాయకుడు లాంటి కమలహాసన్, చిరంజీవి నటించిన సినిమా బాలేదు అని చెప్పడం అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేసింది…
ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఏజ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…కమల్ హాసన్ రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వం లో చేసిన థగ్ లైఫ్ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…ఇక చిరంజీవి సైతం ఇప్పుడు రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు…