History of auto rickshaw: నేటి కాలంలో ఎక్కువగా ప్రయాణం చేయడానికి ఆటో రిక్షాను ఎంచుకుంటారు. ఎందుకంటే తక్కువ మనీతో ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆటోలో వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడవు. అయితే నగరాలు ఎక్కువగా క్యాబ్ అందుబాటులోకి రావడంతో కొంతమంది ఆటో పై అనాసత్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఆటో చార్జీలు కూడా పెరగడంతో ola వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువమంది ఆటోని కోరుకుంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందికి సేవలు అందించిన ఈ ఆటో ప్రయాణం ఇండియాలో ఎలా ప్రారంభమైంది? దీనిని ఎవరు ఇక్కడికి తీసుకువచ్చారు? గతంలో ఏ దేశంలో దీనిని కనుగొన్నారు?
లోకల్ గా ప్రయాణించాలంటే ముందుగా ఎవరైనా ఆటోను సంప్రదిస్తారు. ఒకప్పుడు చాలామందికి ద్విచక్ర వాహనాలు ఉండేవి కావు. దీంతో ప్రయాణం చేయాలంటే ఎక్కువగా ఆటోని సంప్రదించేవారు. ఇందులో రకరకాల ఆటోలు అందుబాటులోకి వచ్చాయి. డీజిల్ ఆటో నుంచి ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఆటోలు ప్రయాణం చేస్తున్నాయి. అయితే ఈ ఆటోను ముందుగా ఇటలీ దేశం లోని వారు కనుగొన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ పూర్తిగా ఆర్థికంగా నష్టపోయింది. దీంతో ఇక్కడి ప్రజలు చిన్న చిన్న వ్యాపారం చేయాలని అనుకున్నారు. అయితే వ్యాపారం చేయడానికి అనుగుణంగా ఒక వాహనం ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో అప్పటికే అందుబాటులో ఉన్న వెస్పా స్కూటర్కు వెనుక వైపు ట్రాలీని అమర్చారు. అలా అమర్చిన తర్వాత మళ్లీ దానిని మార్చి చిన్నచిన్న వస్తువులు తీసుకు వెళ్లే విధంగా తయారు చేశారు. దీనికి Piaggio Ape అని పేరు పెట్టారు. అయితే ఈ ఆటోను చూసిన ఇండియాకు చెందిన నారాయణ కృష్ ఫిరోడియా ఇటలీకి చెందిన ఈ వాహనం ను ఇండియాకు తీసుకొచ్చారు. అయితే దీనిని మనుషులు ప్రయాణం చేసేలా తయారు చేయించారు. ఆ తర్వాత దానికి ఆటో రిక్షా అని పేరు పెట్టారు. భారతదేశంలో ఇది తక్కువ ధరతో పాటు కంఫర్ట్ గా ఉండడంతో చాలామంది ఇందులో ప్రయాణం చేశారు. అలా ఇండియాలో ఆటో రిక్షా ప్రయాణం ప్రారంభమైంది.
దశాబ్దాల పాటు ఆటో రిక్షా తన సత్తా చూపింది. దీనిని వివిధ కంపెనీలు వివిధ రకాలుగా అందుబాటులోకి తీసుకొచ్చారు. బజాజ్ కు చెందిన ఆటో రిక్షాలు ఎక్కువగా విక్రయాలు జరుపుకున్నాయి. మొదట్లో పెట్రోల్ ఆటోలు రాగా.. ఆ తర్వాత డీజిల్ ఆటోలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇతర వాహనాలు ఎన్ని ఉన్నా సమయానికి గమ్యానికి చేరడానికి ఆటో ఎంతో ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ అంబులెన్సులా వచ్చే ఈ ఆటో వల్ల చాలామంది ఉపాధి కూడా పొందుతున్నారు. అయితే నేటి కాలంలో క్యాబ్ ఎక్కువగా రావడంతో ఆటోలపై ప్రయాణం చేయడానికి కొందరు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఆటో చార్జీలు పెరగడంతో ఓలా బైక్ వంటి వాటిపై ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్నిచోట్ల ఆటోలకు ఉన్న ప్రాధాన్యత తగ్గలేదని చెప్పవచ్చు.