Koratala Shiva : కొరటాల శివ స్టోరీ లను దొబ్బేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

ఇక ఈ సినిమాతో సక్సెస్ కనుక సాధించినట్లయితే తన కెరియర్ లో తను పాన్ ఇండియా డైరెక్టర్ అనే మరొక గుర్తింపును సంపాదించుకుంటాడు.

Written By: Gopi, Updated On : January 17, 2024 9:30 pm
Follow us on

Koratala Shiva : ఇండస్ట్రీలో ఉన్న రైటర్లు చాలామంది డైరెక్టర్లుగా మారుతున్నారు. అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్ డైరెక్టర్లుగా మిగిలిపోతున్నారు. ఇక ఈ తరంలో రైటర్ నుంచి దర్శకులుగా మారి సూపర్ సక్సెస్ అయిన వాళ్లలో త్రివిక్రమ్ మొదటి స్థానం లో ఉంటారు. ఇక ఆయన తర్వాత కొరటాల శివ రెండో స్థానం లో ఉంటాడు. కొరటాల కూడా ముందు రైటర్ గా సక్సెస్ అయి ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. అయితే అయన డైరెక్టర్ గా మారడానికి ముఖ్య కారణం ఏంటంటే రైటర్ గా ఉన్నప్పుడు చాలామంది దర్శకులు తనకి అన్యాయం చేశారనే ఉద్దేశ్యం తోనే ఆయన దర్శకుడిగా మారినట్టుగా తనే స్వయంగా ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు.

అయితే బోయపాటి శ్రీను లాంటి దర్శకుడు మాత్రం కొరటాల శివ దగ్గర నుంచి స్టోరీలు నొక్కేసి ఆయన పేరు వేయకుండా బోయపాటి శ్రీను పేరు వేసుకున్నట్టు గా అప్పట్లో చాలా కథనాలు అయితే వచ్చాయి. ఇక అప్పుడే తను డైరెక్టర్ అవ్వాలని రైటర్ కి ఇక్కడ వాల్యూ లేదనే కసితో కథ రాసుకొని ప్రభాస్ తో మిర్చి అనే సినిమా చేసి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కొరటాల శివ. ఇక బోయపాటి శ్రీను తీసిన భద్ర అలాగే సింహా సినిమాలు కొరటాల శివ స్టోరీలే అని కథలు కథలుగా చెప్పుకుంటారు.

నిజానికి ఇండస్ట్రీ లో పక్క వాళ్ల స్టోరీ లు దొబ్బేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. వాళ్లు కష్టపడరు, కష్టపడ్డ వాడికి క్రెడిట్ ఇవ్వరు. ఆ కారణం చేతే చాలా మంది రచయితలు ప్రస్తుతం దర్శకులుగా మారుతున్నారు సక్సెస్ అవుతున్నారు. మిర్చి సినిమాతో దర్శకుడిగా గా మారిన కొరటాల మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ అవుతుంది.

ఇక ఈ సినిమాతో సక్సెస్ కనుక సాధించినట్లయితే తన కెరియర్ లో తను పాన్ ఇండియా డైరెక్టర్ అనే మరొక గుర్తింపును సంపాదించుకుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ తన ఎంటైర్ కెరియర్ లో ఒక ఆచార్య సినిమాని మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి…దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన దేవర సినిమాతో మరొకసారి తన మేకింగ్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు…