Ram Gopal Varma realization: ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన దర్శకుడు ‘రామ్ గోపాల్ వర్మ’.. కెరియర్ మొదట్లో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన ఆ తర్వాత తనకు నచ్చిన సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికి ఆయన చేసిన సినిమాలు ఆడిన, ఆడకపోయిన తను సినిమాలను చేయడం ఆపడం లేదు. ఏదైనా కథ తనను ఇన్స్పైర్ చేసిందంటే చాలు దాన్ని సినిమాగా చేసి ప్రేక్షకుల మీదకి వదులుతుంటాడు. గత కొన్ని రోజులుగా తన ఫామ్ ను కోల్పోయిన వర్మ సినిమాలు చేయడంలో పూర్తి ఆసక్తిని చూపించడం లేదు…ఇక ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు కమిట్ అయిన వర్మ ఆ సినిమాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక అందులో భాగంగానే 4కే డాల్బీ అట్మాస్ సౌండ్ లో శివ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. నవంబర్ 14వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన రీసెంట్ గా చిరంజీవికి క్షమాపణలు చెబుతూ ఒక ట్వీట్ అయితే చేశాడు. చిరంజీవికి వర్మ ఎందుకు క్షమాపణలు చెప్పాడు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి చిరంజీవిని తను విమర్శించిన తీరు సరైనది కాదని వర్మ రియలైజ్ అయి చిరంజీవికి సారీ చెప్పాడు… ఇక చిరంజీవి శివ సినిమా రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక వీడియో బైట్ ఇచ్చాడు. అందులో భాగంగానే వర్మ సైతం చిరంజీవికి సారి చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతో వర్మలో ఇంత రియలైజేషన్ రావడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…
నిజానికి చిరంజీవి నాగార్జున చాలా మంచి ఫ్రెండ్స్… ఇద్దరు బ్రదర్స్ లా కలిసి మెలిసి ఉంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మరొకరు దానికి అండగా నిలబడుతుంటారు… అలాగే రామ్ గోపాల్ వర్మ – నాగార్జున ఇద్దరు చాలా మంచి సన్నిహితులనే విషయం మనకు తెలిసిందే.
వర్మను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా నాగార్జుననే కావడం విశేషం…శివ సినిమా తీసే సమయంలో వర్మని ఎవరు నమ్మకపోతే కేవలం నాగార్జున ఒక్కడే నమ్మి అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి సినిమాను చాలా బాగా కి తీయడానికి ఒక కారణమయ్యాడు. మరి ఇలాంటి సందర్భంలో నాగార్జున చెప్పడం వల్లే వర్మ లో రియలైజేషన్ వచ్చిందని చిరంజీవికి క్షమాపణలు అందుకే చెప్పడని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి అభిమానులు చాలా సంవత్సరాల నుంచి వర్మ మీద విపరీతమైన కోపంతో ఉంటున్నారు. ఎందుకంటే వర్మ ఎప్పటికప్పుడు చిరంజీవిని విమర్శిస్తూ కొన్ని నెగెటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చాడు.
కాబట్టి వాళ్లకు వర్మను చూస్తే విసుగొచ్చేది. కానీ ఎట్టకేలకు వర్మ క్షమాపణలు చెప్పడంతో ఇప్పుడు చిరంజీవి అభిమానులు సైతం కొంతవరకు ఆనందపడుతున్నారు… ఇక మరి కొంతమంది మాత్రం వర్మ క్షమాపణలు చెప్పడం వెనుక శివ సినిమానే కారణం అనే ధోరణిలో లో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి శివ మూవీ రీ రిలీజ్ లో ఎలాంటి సత్తా చాటుతోంది. తద్వారా సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయి అనేది…