Puri Jagannath flops: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్…కెరీర్ స్టార్టింగ్ లో ఆయన పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి హీరోలతో మంచి సక్సెస్ లను సాధించాడు. ఇక మహేష్ బాబుతో చేసిన ‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత నుంచి అంత పెద్ద భారీ సక్సెస్ అనేది అందుకోలేకపోయాడు. అయినప్పటికి బిజినెస్ మాన్, గోలీమార్ హార్ట్ ఎటాక్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి మంచి సినిమాలు చేశాడు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన సరైన ఫామ్ ను మాత్రం అందుకోలేకపోతున్నాడు. లైగర్ సినిమాతో బొక్క బోర్ల పడ్డ ఆయన ఆ తర్వాత చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి ‘బెగ్గర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో అయిన టచ్ లోకి వస్తాడా లేదా అనే అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం ఆయన ఉన్న సిచువేషన్ ను బట్టి చూస్తే ఈ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవచ్చు. నిజానికి ఆయన ఎక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయాడు అంటే అతని సినిమాలు ప్రేక్షకులను ఆదరించడం లేదు. నిజానికి ఆయన ఒకటే జానర్ లో కథలను రాసుకొని సినిమాగా చేస్తున్నాడు.
దానివల్ల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు… మొత్తానికైతే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా గొప్ప విజయాలను సాధించాలంటే మాత్రం ఇంతకు ముందు ఆయన చేసిన సినిమా ఫార్మాట్ వదిలి కొత్త ఫార్మాట్ లో సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది. ఆయన కనక తన వైఖరిని మార్చుకోకపోతే మాత్రం తన పరిస్థితి డైలమాలో పడే అవకాశమైతే ఉంది.
ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఈ సినిమాతో కనక విజయాన్ని సాధించకపోతే మాత్రం ఆయనకి అవకాశాన్నిచ్చే హీరోలు కూడా కరువవుతారు. ఇలా చేస్తే తన సినిమాలను చూడడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించకపోవచ్చు…