Homeఎంటర్టైన్మెంట్CM Revanth Reddy At Allu Sirish Wedding: అల్లు శిరీష్ పెళ్ళికి హాజరు..విజయ్...

CM Revanth Reddy At Allu Sirish Wedding: అల్లు శిరీష్ పెళ్ళికి హాజరు..విజయ్ దేవరకొండ రిసెప్షన్ కి డుమ్మా..సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఇదేనా ?

CM Revanth Reddy At Allu Sirish Wedding: సినీ ఇండస్ట్రీ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లిళ్లే కనిపిస్తున్నాయి. రీసెంట్ గానే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక జంట పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఎంత గ్రాండ్ గా జరిగిందో మన కళ్లారా చూసాము. ఇక నిన్న అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ , నాయనికా అనే అమ్మాయిని పెళ్లాడాడు. కుటుంబ సభ్యులు , బంధు మిత్రులు , సినీ , రాజకీయ ప్రముఖుల మధ్య ఈ వివాహా వేడుక ఎంతో అట్టహాసం గా జరిగింది. ఈ పెళ్ళికి స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చిన వారిలో ఒకరు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో అల్లు కుటుంబం ఎంతో ఆప్యాయతతో వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ పెళ్ళికి రావడం పై సోషల్ మీడియా లో అనేక చర్చలకు దారి తీసింది. విజయ్ దేవరకొండ పెళ్ళి కి, వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరు అవ్వని రేవంత్ రెడ్డి , ఎందుకు అల్లు శిరీష్ పెళ్ళికి ఎలా హాజరయ్యాడు ?, అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అడుగుతున్న ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డి ని విజయ్ దేవరకొండ ఒకసారి కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత రష్మిక కూడా ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించింది. తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి బొట్టు పెట్టి, పట్టు చీర కూడా ఇచ్చి పంపించింది. కచ్చితంగా వీళ్లిద్దరు విజయ్ దేవరకొండ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరు అవుతారని అనుకున్నారు, కానీ రాలేదు. కానీ అల్లు అర్జున్ ని జల్లు లో పెట్టించి, అతనితో విభేదించినప్పటికీ ఆయన తమ్ముడి పెళ్ళికి రేవంత్ రెడ్డి హాజరయ్యాడు.

దీని వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే విజయ్ దేవరకొండ BRS పార్టీ కి అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ , కవిత లతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి వీళ్ళలేదని అంటున్నారు. ప్రభుత్వానికి సన్నిహితులు చెప్తున్న మాట ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి ఆరోజు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాడు, అందుకే రాలేదని అంటున్నారు. వీటిలో ఏది నిజమో తెలియదు కానీ. ఇలా విరోధం పెట్టుకున్న వారి పెళ్ళికి వెళ్లడం, ఎంతో ఆప్యాయతతో గౌరవించి పెళ్ళికి పిలిచిన విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ కి వెళ్ళకపోవడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular