SS Rajamouli: రాజమౌళి.. ప్రశాంత్ నీల్.. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్లే.. దక్షిణాది సినిమాలను పాన్ వరల్డ్ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు వీరిద్దరి సినిమాల కోసం వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డులు క్రియేట్ చేశారు. ప్రశాంత్ నీల్ కేజీయఫ్ ఛాప్టర్ 2 తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి 2 సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు మన దేశంలోనే ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లు వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. డిజిటల్ యుగంలో మన దేశంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన చిత్రంగా బాహుబలి 2 రికార్డులకు సృష్టించింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా డైరక్టర్ గా మారారు.
Also Read: Balakrishna- Ravi Teja: అదే నిజమైంది.. బాలయ్యతో రవితేజ.. కలయిక ఖరారు
అయితే రాజమౌళి పది సినిమాలకు వచ్చిన క్రేజ్ ను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ లాంటి ఒక్క సినిమాతో సంపాదించుకున్నాడు. కేజీఎఫ్ 350 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి కన్నడ సినీ చరిత్రలో టాప్ స్థాయిలో నిలబడింది. ఇప్పుడు కేజేఎఫ్ చాప్టర్ 2 యాశ్ హీరోగా డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నాడు. అయితే బాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తుండటం ప్లస్ పాయింట్.
అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆల్రెడీ వచ్చేసింది, కేజీఎఫ్ పార్ట్ 2 రెడీగా ఉంది. ఈ రెండు సినిమాలు ఒకే సీజన్లో రావడం, రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడం, రెండూ దక్షిణాది నుంచి రెడీ కావడం మాత్రం ఇంట్రస్టింగ్ అంశాలు. అందులోనూ నీల్ ఇప్పుడు తెలుగులో జెండా పాతడానికి రెడీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమ్మర్ లోనే రిలీజ్ అనుకున్నా ఇప్పుడప్పుడే అయ్యేట్లు కనిపించడంలేదు. ఆతర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.
రాజమౌళికి తండ్రి విజయేంద్ర ప్రసాద్, సోదరుడు కీరవాణి, మరీ ముఖ్యంగా తనయుడు కార్తికేయ.. ఇలా అన్ని రంగాల నుంచి రాజమౌళికి అద్భుతమైన ప్యాడింగ్ ఉంది. కాగా ప్రశాంత్ నిల్ ఎలాంటి సపోర్ట్ లేకుండా కేజీఎఫ్ తో టీమ్ ను సెట్ చేసుకున్నాడు. పార్ట్-1తో మ్యాజిక్ చేశాడు. పార్ట్-2తో ఆ మేజిక్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. కేజీఎఫ్ 2 హిట్టయ్యి అనుకున్నట్టుగా వసూళ్లు సాధిస్తే.. సౌత్ ఇండస్ట్రీకి శంకర్, రాజమౌళి లాంటి మరో దర్శకుడు ప్రశాంత్ నిల్ దొరికినట్టే అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read:Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: అనసూయతో యాడ్ కోసం చిరంజీవి ఎంత తీసుకున్నారో తెలుసా ?