OKTelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్

OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. జర్నలిస్టు పై దాడి కేసులో ఇటీవల అంధేరీ కోర్టు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌, అతని బాడీగార్డ్‌ నవాజ్‌ షేక్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ అంధేరీ కోర్టు జారీ చేసిన నోటీసులకు సవాల్ చేస్తూ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. జిల్లా కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని, తనకు ఉపశమనం కల్పించాలని ఆయన కోరాడు. ఇక మరో […]

Written By: Shiva, Updated On : April 5, 2022 5:25 pm
Follow us on

OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. జర్నలిస్టు పై దాడి కేసులో ఇటీవల అంధేరీ కోర్టు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌, అతని బాడీగార్డ్‌ నవాజ్‌ షేక్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ అంధేరీ కోర్టు జారీ చేసిన నోటీసులకు సవాల్ చేస్తూ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. జిల్లా కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని, తనకు ఉపశమనం కల్పించాలని ఆయన కోరాడు.

Salman Khan

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీని కువైట్‌లో ప్రదర్శించకుండా బ్యాన్ విధించారు. దీనికి సంబంధించి ఓ అభిమాని చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలో పాకిస్తాన్ గురించి.. టెర్రరిస్టులను, వయోలెన్స్‌ను చూపించడం కారణం కావొచ్చు. గతంలో కురుప్, ఎఫ్ఐఆర్ వంటి ఇండియన్ సినిమాలపై కువైట్‌లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే అంటూ రాసుకొచ్చాడు.

Also Read: Balakrishna- Ravi Teja: అదే నిజమైంది.. బాలయ్యతో రవితేజ.. కలయిక ఖరారు

Beast

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మోడల్‌ గా కెరీర్‌ ని మొదలుపెట్టిన విమలా రామన్ హీరోయిన్‌ గా మారింది. ‘గాయం-2’, ‘చట్టం’ తదితర తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. అనంతరం మలయాళం చిత్రాల్లో స్టార్ హీరోయిన్ హోదాను పొందింది. ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ‘వాన’ సినిమాలో హీరోగా నటించిన ‘వినయ్ రాయ్’ను ఆమె పెళ్లాడనుంది. వినయ్ రాయ్ ప్రస్తుతం కోలీవుడ్‌లో విలన్‌గా సెటిల్ అయిపోయాడు.

Vinay Rai

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ బ్యాలెన్స్ షూట్ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీనికోసం కొన్ని భారీ సెట్లను తీర్చిదిద్దుతున్నారు. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఆధ్వర్యంలో ఈ సెట్స్ నిర్మాణం జరుగుతోంది.

Hari Hara Veera Mallu

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజబ్ లీలా భన్సాలీతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన భన్సాలీతో బన్నీ కొత్త ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. దక్షిణాది యోధుని ఆధారంగా భన్సాలీ ఒక పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారని, అందులో బన్నీ హీరోగా చేయనున్నారని తెలుస్తోంది.

Also Read:Prabhas- Allu Arjun Remuneration: రెమ్యునరేషన్ లో ప్రభాస్ కంటే.. బన్నీనే ఎక్కువ

Tags