Bigg Boss 5 telugu: బిగ్ బాస్ ఎట్టకేలకు నాలుగో వారానికి చేరుకుంది. చాలా రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఇటు ఆట పరంగా అటు కంటెంట్ పరంగా ది బెస్ట్ ఇస్తున్నారు. గడిచిన సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తమ పరిధి దాటి మరి ఆడటానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ కూడా ఆడా మగా అని తేడా లేకుండా మగవాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.

నిన్న (బుధవారం) జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ చాలా చురుకుగా పార్టిసిపేట్ చేశారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరికి ఆకలి బాధ ఎలా ఉంటుందో ఈ టాస్క్ ద్వారా హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ తెలియ చేసాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా బిగ్ బాస్ కొన్ని టాస్క్ లు ఇచ్చాడు. మొదటి టాస్క్ లో శ్రీరామ చంద్ర – హమీదా, రెండో టాస్క్ లో విశ్వ – రవి, మూడో టాస్క్ లో మానస్ – సన్నీ గెలుపొందారు.
ఒక్కరోజు ముందుగానే షూటింగ్ అవ్వడం వల్ల బిగ్ బాస్ హౌస్ లో లీకుల పర్వం కొనసాగుతోంది. అలా లీకులు జరుగుతున్న తరుణంలో బిగ్ బాస్ మూడవ వారానికి గానూ ‘శ్రీరామచంద్ర’ నాలుగో వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా నిలిచాడని వినికిడి. రేషన్ మేనేజర్ గా ‘హమీదా’ ఎంపిక అయ్యింది.