Dasara 2023 Movies: పండుగలు వస్తున్నాయంటే ఇండస్ట్రీలో ఫుల్ గిరాకీ ఉంటుంది. స్టార్ హీరోలు ఆ డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇక సంక్రాంతి, దసరా, దీపావళి సమయంలో మరింత పోటీ ఉంటుంది. అయితే ఈ సారి స్టార్ హీరోలు దసరా బరిలో దిగిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ, రవితేజ, విజయ్ దళపతి ఇలా ముగ్గురు కూడా రేస్ లో ఉన్నారు. వీరి సినిమాలు రిలీజై వారం కూడా దాటింది. మరి ఈ పోటీలో విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజై సక్సెస్ టాక్ ను సంపాదించింది. ఇక అదే రోజు బాలయ్యకు పోటీగా విజయ్ లియో సినిమాతో వచ్చాడు. మిశ్రమ టాక్ ను సంపాదించిన లియో సినిమా కలెక్షన్స్ లలో మాత్రం కుమ్మేసింది. అలాగే మాస్ రాజా రవితేజ వంశీ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీటైగర్ నాగేశ్వరరావుతో ఒకరోజు లేటుగా వచ్చారు. అంటే అక్టోబర్ 20న బరిలోకి దిగాడు మాస్ రాజా. ఈ సినిమా కూడా మిశ్రమ స్పందనను పొందింది. అయితే ఈ మూడు సినిమాల్లో ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వచ్చిన సినిమా లియో.
అన్నింటికంటే కాస్త ఎక్కువ మార్కులు సంపాదించిన సినిమా లియో అనగానే కాస్త ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ ఇదే నిజం. నెటిజన్ల టాక్ తో సంబంధం లేకుండా కేవలం తెలుగులో 17 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగి ఇప్పటికే 15.50 కోట్లు రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా 400 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది. ఇక భగవంత్ కేసరి కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే 80 కోట్ల గ్రాస్ వరకు రాబట్టింది. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 20 కోట్లకు పైగానే రాబట్టాలి. మరో రెండు మూడు రోజులు సెలవులు ఉండడమే కాకుండా నెక్స్ట్ వీకెండ్ కూడా కొత్త సినిమాలు లేకపోవడంతో సేఫ్ జోన్ లోకి రావడం ఖాయం.
ఈ రెండింటితో పోలిస్తే టైగర్ నాగేశ్వర రావు సినిమా వెనుకంజలో ఉంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా కేవలం రూ. 13 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. మరో 25 కోట్లు వసూళ్లు చేస్తే తప్ప గట్టెక్కడం కష్టమే. అయితే టైగర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ నుంచి బయట పడే అవకాశం చాలా తక్కువ. ఇలా మూడు సినిమాలతో పోలిస్తే.. ముందంజలో ఉన్నారు విజయ్. ఇక తెలుగు హీరోల విషయానికి వస్తే.. రవితేజ కంటే బాలయ్యనే ఎన్నో రెట్లు ముందున్నారు అని టాక్. అయినా ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారిదే.. ఎవరి క్రేజ్ వారిదే అంటున్నారు ముగ్గురు హీరోల అభిమానులు.