Telangana Politics : తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఇంకా పూర్తి కాలే !

చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణ లాంటి వారు తమ ఉద్యమ పంథాలను వదిలేసి పార్టీలు మారారు. సిద్ధాంతాలు ఏవీ లేవు ఇందులో.. పచ్చి అవకాశవాదం..

Written By: Neelambaram, Updated On : October 24, 2023 5:51 pm

Telangana Politics : తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రోతపుట్టే పరిస్థితి దాపురించింది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారుతారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఏరోజు ఏ సర్వే ఏ పార్టీ గెలుస్తుందో చెప్పని పరిస్థితి. హంగ్ వస్తుందా.? కాంగ్రెస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ గెలుస్తుందా? అన్న దానిపై క్లారిటీ రావడం లేదు.

ఇక మీడియా, సోషల్ మీడియాలో, మేధావులు, ఇతర జర్నలిస్టులు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారు. రాజకీయ నేతలు టికెట్లు రాకపోయేసరికి ఒక్కసారిగా పార్టీ మారిపోతారు. ఏ వ్యక్తులను విమర్శించారో వారి వద్దకే వెళ్లి కాళ్లు పట్టుకుంటున్నారు.

చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణ లాంటి వారు తమ ఉద్యమ పంథాలను వదిలేసి పార్టీలు మారారు. సిద్ధాంతాలు ఏవీ లేవు ఇందులో.. పచ్చి అవకాశవాదం..

తెలంగాణ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.