Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు లాంటి నటుడు ప్రస్తుతం పాన్ ఇండియా లో ఒక్క సినిమాని చేయకపోయినప్పటికి డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ఆయనకంటూ ఒక భారీ రికార్డును క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఈ సినిమాతో ఆయన స్టార్ డమ్ ఏ రేంజ్ కి వెళుతుంది. ఎలాంటి అవార్డులను అందుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోల మధ్య మంచి పోటీ అయితే ఉంటుంది. సినిమా కెరియర్ పరంగా ఎవరికి వారు ముందు వరుసలో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ మధ్య సినిమాల పరంగా మాత్రమే పోటీ ఉంటుంది. అంతే తప్ప పర్సనల్ జీవితం లో మాత్రం ఎలాంటి వివక్షలు ఉండవు అంటూ ప్రతి ఒక్క హీరో తమ అభిమానులతో గాని, ప్రేక్షకులతో గాని ఈ విషయాలను పంచుకుంటూ ఉంటారు. నిజానికి ఒకరి ఇంట్లో ఫంక్షన్ అయితే మరొక హీరో దగ్గరుండి మరి ఆ ఫంక్షన్ ని చూసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక ఈ ఫ్రెండ్లీ వాతావరణం అనేది ప్రతి ఒక్క హీరో మధ్య ఉంటుందనే చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికి కొంతమంది హీరోల మధ్య మాత్రం మంచి బాండింగ్ అయితే ఉంటుంది. నిజానికి మహేష్ బాబు(Mahesh Babu) పెద్దగా ఎవరితో కలవడు. సినిమాలు ఉంటే షూటింగ్ కి వెళ్తాడు, లేకపోతే వెకేషన్ కి వెళ్తాడు. అంతే తప్ప ఆయన మిగతా హీరోలతో కలిసి పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతూ ఉండడు.
తద్వారా ఆయనకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో అతనికి రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్ (NTR) లాంటి హీరోలు మంచి సన్నిహితులు… ఇక వీళ్ళిద్దరిలో కూడా ఎన్టీఆర్ అంటే మహేష్ బాబుకి చాలా ఇష్టమని, క్లోజ్ ఫ్రెండ్ లా ఉంటాడని కూడా చాలా సందర్భాల్లో తెలియజేశాడు.
ఎన్టీఆర్ కూడా మహేష్ బాబు ని అన్నా అని పిలుస్తూ ఉంటాడు. ఫ్రెండ్ కు మించిన అన్నదమ్ముల బంధం అయితే వీళ్ళ మధ్య ఉందని ఇటు ఘట్టమనేని అభిమానులు, అటు నందమూరి ఫ్యాన్స్ సైతం ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మహేష్ బాబు ఇప్పుడు ఫ్యాన్ వరల్డ్ సినిమా చేస్తూ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.
కాబట్టి ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోయే సినిమాలతో వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంలో మహేష్ బాబు ఉన్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…