SRH IPL 2025 Schedule
SRH IPL 2025 Schedule: ఐపీఎల్ 2025లో భాగంగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం 11 మ్యాచ్లు జరుగుతాయి. హైదరాబాదులో మొత్తం తొమ్మిది మ్యాచ్లు నిర్వహిస్తారు. లీగ్ దశలో హైదరాబాద్ జట్టు ఆడే ఏడు మ్యాచ్లతో పాటు క్వాలిఫైయర్ -1, ఎలిమినేటర్ మ్యాచ్ లు ఉప్పల్ వేదికగా జరుగుతాయి. ఇక ఢిల్లీ జట్టు రెండవ హోం వెన్యూగా విశాఖపట్నం మైదానాన్ని ఎంచుకుంది. ఫలితంగా మార్చి 24న లక్నోతో ఢిల్లీ జట్టు పోటీ పడుతుంది. మార్చి 30న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ తలపడుతుంది. ఇక ఈ సీజన్లో భాగంగా హైదరాబాద్ జట్టు లీగ్ దశలో 14 మ్యాచులు ఆడుతుంది. ఇందులో ఏడు మ్యాచ్లు హైదరాబాద్ లోనే జరుగుతాయి. ఇక తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, క్లాసెన్ వంటి ప్లేయర్లతో హైదరాబాద్ జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది..
ఈసారి కప్ సాధించాలి
హైదరాబాద్ జట్టు గత సీజన్లో ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా చేతిలో ఓటమిపాలైంది.. ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. లీగ్ దశలో, ఎలిమినేటర్ దశలో హైదరాబాద్ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చూపించారు. తిరుగులేని ఆటతీరుతో ఆకట్టుకున్నారు . అయితే ఫైనల్ మ్యాచ్ కు వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. కోల్ కతా బౌలర్లకు దాసోహం అయ్యారు. అయితే ఈసారి ఆ తప్పును పునరావృతం చేయకూడదని హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మిగతా ఆటగాళ్లు తీవ్రమైన సాధనలో మునిగితేలుతున్నారు. ” ఈసారి కప్ ఎలాగైనా దక్కించుకోవాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. ఇందులో బాగానే ఆటగాళ్ళు తమ వంతు సాధన మొదలుపెట్టారు.. మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా హైదరాబాద్ జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఈసారి టైటిల్ ఫేవరెట్లలో హైదరాబాద్ ఒకటి అని చెప్పక తప్పదు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ మాత్రమే ఐపీఎల్లో ఆడుతోంది. అలాంటప్పుడు ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు కచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం.. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే ఆటగాళ్లు మరింత తీవ్రంగా సాధన చేయాలి.. ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి. గత సీజన్లో ఓడిపోయినప్పటికీ.. ఈసారి పటిష్టమైన ప్రణాళికలతో రంగంలోకి దిగితే పెద్దగా ఇబ్బంది ఉండదని కప్ కచ్చితంగా సాధిస్తుందని,” తెలుగు క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.