Bommarillu: బొమ్మరిల్లు స్టోరీ చెప్పగానే ఈ సినిమా నేను చేస్తే ప్లాప్ అవుతుంది అని చెప్పిన ఆ హీరో ఎవరంటే..?

ప్రతి ఇంట్లో ఒక తండ్రి, కొడుకు లా మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, తండ్రి కొడుకుని ఎక్కువగా ప్రేమించడం వల్ల కొడుకు ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాడు. అనేది మన కళ్ళకి కట్టినట్టుగా ఈ సినిమా ద్వారా చూపించారు.

Written By: Gopi, Updated On : November 23, 2023 4:03 pm

Bommarillu

Follow us on

Bommarillu: దిల్ రాజు ప్రొడక్షన్ లో భాస్కర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ దిల్ రాజు తీసిన సినిమా బొమ్మరిల్లు… ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అయి రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ప్రతి ఫ్యామిలీ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేశారు.

ప్రతి ఇంట్లో ఒక తండ్రి, కొడుకు లా మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, తండ్రి కొడుకుని ఎక్కువగా ప్రేమించడం వల్ల కొడుకు ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాడు. అనేది మన కళ్ళకి కట్టినట్టుగా ఈ సినిమా ద్వారా చూపించారు. అయితే ఈ సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు దర్శకుడు భాస్కర్ సినిమాను ఎన్టీఆర్ తో చేద్దాం అని అనుకున్నారంట ఇక అదే విషయాన్ని దిల్ రాజుకి చెప్తే దిల్ రాజు భాస్కర్ ని తీసుకెళ్లి ఎన్టీఆర్ కి కథ వినిపించాడు.

ఆ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చింది కానీ అది ఎన్టీఆర్ ఇమేజ్ కి సరిపడా కథ కాదు కాబట్టి స్వయం గా ఎన్టీయారే ఇది మంచి స్టోరీ దీన్ని నాకంటే ఎవరైనా అప్ కమింగ్ హీరోలతో చేస్తే బాగుంటుంది. నేను చేయడం వల్ల ఈ సినిమా పెద్దగా ఆడదు అప్ కమింగ్ హీరో అయితేనే దీనికి 100% న్యాయం చేయగలడు అని చెప్పడంతో అప్పుడు దిల్ రాజు, భాస్కర్ ఇద్దరు కలిసి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సిద్దార్థ్ ని హీరోగా పెట్టి ఈ సినిమా తీయాలి అనుకున్నారు వాళ్ళు అనుకున్నట్టుగానే సిద్ధార్థ్ ను పెట్టి ఈ సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నారు.

ముఖ్యంగా దర్శకుడు భాస్కర్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు.ప్రతి ఒక్క సీన్ కూడా ఆడియన్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కైతే ఈ సినిమా మంచి ఫీస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక సిద్దు లాంటి ఒక కొడుకు ప్రతి ఇంట్లో ఉంటాడు, వాళ్ళ నాన్న లాంటి ఒక తండ్రి కూడా ఉంటాడు వాళ్ళిద్దరి మధ్య ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ని చాలా బాగా చూపించాడు బొమ్మరిల్లు భాస్కర్…

ఇక ఈ సినిమాని రిజెక్ట్ చేసి ఎన్టీఆర్ మంచి పని చేశాడు అంటూ అప్పట్లో చాలా మంది ఈ సినిమా గురించి మాట్లాడారు. ఎందుకంటే ఎన్టీఆర్ అప్పట్లో మంచి మాస్ హీరోగా మంచి ఊపులో ఉన్నాడు. అలాంటి సమయం లో ఇలాంటి సినిమా చేస్తే తన అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉండకపోయేది. దానివల్ల ఎన్టీయార్ అభిమానులకి ఈ సినిమా నచ్చక పోయేది. దాంతో ఈ సినిమా కంటెంట్ అనేది స్పైల్ అయిపోయేది అంటూ అప్పట్లో ట్రేడ్ పండితులు ఈ సినిమా మీద స్పందించడం విశేషం…