Sivaji Raja: వాడు నాకంటే మంచి నటుడు కావచ్చు, కానీ ఆ విషయం లో నా కాలి గోటి కి సరిపోడు : శివాజీ రాజా…

శివాజీ రాజా ఇప్పుడు సినిమాలు చేయడం కొద్దిగా తగ్గించారు. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ మంచి సినిమాలు చేస్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన అప్పట్లో మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కి అధ్యక్షుడిగా వ్యవహరించాడు.

Written By: Gopi, Updated On : November 23, 2023 4:08 pm

Sivaji Raja

Follow us on

Sivaji Raja: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకి వచ్చిన అవకాశాలను వాడుకుంటూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఇక్కడ స్టార్ హీరోలుగా గుర్తించబడతారు ఇక అందరి చేత మంచి నటులుగా కూడా కీర్తించ బడతారు. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడ గలుగుతారు. ఇక ఇప్పుడు అలాంటి కోవ కి చెందిన వాళ్లలో నటుడు శివాజీ రాజా ఒకరు. ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో కమెడియన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారి మంచి సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు.

ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. అలాంటి శివాజీ రాజా ఇప్పుడు సినిమాలు చేయడం కొద్దిగా తగ్గించారు. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ మంచి సినిమాలు చేస్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన అప్పట్లో మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇక అలాంటి సమయంలో తను ఒక పెద్ద నటుడి తో గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో శివాజీ రాజా అనేక రకాలైన కామెంట్లను కూడా చేశాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆ నటుడి గురించి మాట్లాడుతూ వాడు యాక్టింగ్ లో నాకంటే గొప్ప నటుడు కావచ్చు కానీ మంచితనంలో , బుద్ధిలో వాడు కాలి గోటి కి కూడా సరిపోడు అంటూ సంచలనకరమైన వాక్యాలు చేశాడు.

అయితే ఇంతకూ ఆ నటుడు ఎవరు అనేది ఇక్కడ కీలకం గా మారింది. శివాజీ రాజా మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వ్యవహారాలన్నీ సక్రమంగా సాగాయి ఆయన అధ్యక్షుడిగా దిగిపోయినప్పటి నుంచి మా లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. ఇక ఏది ఏమైనా శివాజీ రాజా తన కోర్టిస్ట్ పైన అలా కోపంతో మాట్లాడడం అనేది అప్పట్లో పెను దుమారాన్ని రేపింది. ఇక ప్రస్తుతం మా అధ్యక్షుడిగా మంచు విష్ణు కొనసాగుతున్నాడు. ఆయన పదవీ లోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న సమయంలో మంచు విష్ణు కూడా తన పదవి నుంచి తొలగిపోయి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేఅవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక ఎంత మంది అధ్యకులు మారిన ఎవ్వరు కూడా మా అసోసియేషన్ కి పెద్దగా చేసింది ఏమీ లేదు అంటూ పలువురు సీనియర్ నటులు సైతం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మా అధ్యక్షుడు అంటే అవకాశాలు లేని నటులకు అవకాశాలను కల్పించాలి. అలాగే వృద్దాప్యం లో ఉన్న నటులకు పెన్షన్ అనేది అరేంజ్ చేస్తూ ఉండాలి.ఇక ఇప్పుడు ఇలాంటివి ఏమీ సరిగ్గా అందించడం లేదు అంటూ పలువురు సీనియర్ నటులు చెప్తున్నారు…