Chiranjeevi: 80లలో చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్నాడు. 90ల నాటికి చిరంజీవి స్టార్డం పీక్స్ కి చేరింది. 1992లో విడుదలైన గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ కాగా… చిరంజీవి రెమ్యూనరేషన్ కోటి రూపాయలకు చేరిందట. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి అవతరించాడు. అమితాబ్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరో చిరంజీవి అంటూ.. బాలీవుడ్ మ్యాగజైన్ లో కథనం ప్రచురించారు. చిరంజీవి స్టార్డం, మేనియా చెప్పేందుకు అది ఒక ఉదాహరణ.
అయితే చిరంజీవికి ఒక హీరో పోటీ ఇచ్చాడు. ఓ సందర్భంలో ఆ హీరోతో చిరంజీవి… నేను కాదు నువ్వు మెగాస్టార్ కావాల్సింది అన్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే సుమన్. ఏక కాలంలో సుమన్, చిరంజీవి పరిశ్రమలో అడుగుపెట్టారు. సుమన్ చాలా అందంగా ఉంటాడు. అలాగే కరాటే, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. దాంతో సుమన్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఆయనకు ఇమేజ్ ఉండేది.
చిరంజీవి-సుమన్ పోటీపడ్డారు. సుమన్ ఫైట్స్ లో దిట్ట అయితే… చిరంజీవి డాన్సుల్లో ట్రెండ్ సెట్టర్. అయితే సుమన్ వివాదాల కారణంగా కెరీర్ నాశనం చేసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవికి మీరు పోటీ ఇచ్చారు. చిరంజీవి స్వయంగా చెప్పారట, నేను కాదు మీరు మెగాస్టార్ కావాల్సింది.. అన్నారట కదా? అని అడగ్గా… చిరంజీవి ఆ మాట అనలేదని సుమన్ స్పష్టత ఇచ్చారు.
చిరంజీవికి పోటీ ఇవ్వాలని, అవుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నాకు కూడా తెలియకుండా అయ్యాను. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక చిరంజీవి సరికొత్త హీరోగా అవతరించాడు. చిరంజీవి మాదిరి నేను యాక్టింగ్, ఫైట్స్ చేస్తున్నాను. కానీ డాన్సులు చేయలేను. ఆ క్వాలిటీ చిరంజీవిని ప్రత్యేకంగా మార్చాయి.. అని సుమన్ అన్నారు. అయితే చిరంజీవికి నేను పోటీ ఇవ్వాలని నేను భావించలేదని అన్నారు.
నేను నటించిన కొన్ని సినిమాలు చిరంజీవి సినిమా కలెక్షన్స్ కి దీటుగా కలెక్షన్స్ రాబట్టాయి. నేను చిరంజీవికి కాంపిటీషన్ కాదు అనుకోవడానికి కారణం… నేను హీరో అవుతాను అనుకోలేదు. పరిశ్రమకు వస్తాను అనుకోలేదు. నేను సాధించిన దాని పట్ల సంతోషంగా ఉన్నాను.. అని సుమన్ చెప్పుకొచ్చారు. సుమన్ కెరీర్ పీక్స్ లో ఉండగా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయ్యాడు. స్నేహితుడు చేసిన నేరానికి సుమన్ శిక్ష అనుభవించాడు.