Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు వివాదం యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచింది. దీనిపై తప్పు మీది అంటే మీది అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసిపి హయాంలోనే ఈ కల్తీ వ్యవహారం నడిచిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై వైసీపీ కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది.అప్పట్లో టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లగా వ్యవహరించిన వై వి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను ఖండించారు.మాజీ సీఎం జగన్ సైతం ఇది చంద్రబాబు ఆడిన డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ఇంకోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే దీనిని బయట పెట్టింది సీఎం చంద్రబాబు. అంతకుమించి రియాక్ట్ అయ్యింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటనను నిరసిస్తూ ప్రాయశ్చిత్త దీక్షకు కూడా ఆయన దిగారు. పవన్ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.వైసీపీ ప్రభుత్వమే అప్పట్లో అలా వ్యవహరించిందన్న ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి.ఈ నేపథ్యంలో జగన్ కేంద్రానికి లేఖ రాశారు. జరిగిన ఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ పతాక స్థాయికి జరిగిందని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.సరిగ్గా ఇదే సమయంలో పవన్ యూటర్న్ తీసుకోవడం విశేషం.
* జగన్ తప్పిదం ఎలా అవుతుంది
తాజాగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము జగన్ ను తప్పు పట్టడం లేదని ప్రకటించారు. అప్పటి టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విధంగా వ్యవహరించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ట్రస్ట్ బోర్డ్ పై ఉందని.. అందులో వైఫల్యం చెందినందు వల్లే తాము ప్రస్తావించామని గుర్తు చేశారు. కేవలం అప్పటి ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవోలు ఏం చేస్తున్నారని ప్రశ్నించామని చెప్పుకొచ్చారు.అప్పట్లో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.అయితే జగన్ క్లీన్ చీట్ ఇవ్వడం ఏమిటని కొత్త ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
* జగన్ లేఖ తోనే
కేవలం జగన్ కేంద్రానికి లేఖ రాశారని.. కేంద్ర పెద్దల ఆదేశాలతో పవన్ వెనక్కి తగ్గారని ప్రచారం ప్రారంభమైంది. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియాలి. గతంలో వైసీపీ అధికారంలో ఉండేది. అప్పటి ప్రభుత్వం పై విపక్షాలు ఆరోపణలు చేశాయి. కానీ ఎన్నడూ కేంద్రం కలుగజేసుకోలేదు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుపై కూడా అప్పట్లో విపక్షాలు అనేక రకాలుగా తప్పుపట్టాయి. కానీ ఒక్కనాడు అంటే ఒక్కనాడు కూడా కేంద్రం కలుగు చేసుకున్న దాఖలాలు లేవు. అది రాష్ట్ర ప్రభుత్వ హక్కు, బాధ్యత అన్న ధోరణిలో అప్పట్లో కేంద్రం వ్యవహరించింది. అయితే ఇప్పుడు కేంద్రం కలుగజేసుకుంటుందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
* పవన్ కీలక సూచనలు
లడ్డు వివాదం నేపథ్యంలో.. సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కీలక సూచన చేశారు పవన్. పైగాతిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే.. అతి పెద్ద హిందూధర్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. అటువంటి ఆలయ పవిత్రతకు భంగం కలిగితే కేంద్రం వెనుకేసుకొస్తుందా అన్న అనుమానం కూడా ఉంది. పైగా కేంద్రంలో ఇప్పుడు టిడిపి తో పాటు జనసేన అవసరం కీలకం. అయితే జగన్ కేంద్రానికి లేఖ రాయడం.. అదే సమయంలో జగన్ తప్పు లేదని పవన్ క్లీన్ చీట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారుతోంది.