Srinidhi Shetty: యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ రెండూ కూడా కాసుల వర్షాన్ని కురిపించాయి. ఈ సినిమాలో హీరో యష్ సరసన శ్రీనిధి శెట్టి అనే అమ్మాయి నటించింది. అయితే కేజీఎఫ్ ముందు శ్రీనిధి గురించి కనీసం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లో ఆమె నటించిన పాత్ర పరిధి చాలా చిన్నది. దీంతో సినిమా హిట్టయినా ఆటలో అరటిపండుగానే మిగిలిపోయింది.

అయితే కేజీఎఫ్ చాప్టర్-2లో శ్రీనిధి పాత్ర పరిధి పెరిగింది. యష్‌తో ఆమె రొమాన్స్ ప్రేక్షకులను అలరించింది. ఓ సాంగ్ కూడా ఉంది. తన అందంతో అభిమానులను ఆకర్షించిన శ్రీనిధి కేజీఎఫ్‌లో నటించకముందే మిస్ దివా సూపర్ నేషనల్ 2016 పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ టైటిల్ గెలిచిన రెండో భారతీయురాలుగా శ్రీనిధి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా కేజీఎఫ్ పార్ట్ 1కు సంబంధించి ఉత్తమ నటిగా సైమా అవార్డును కూడా కైవసం చేసుకుంది.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తన రిలేషన్‌షిప్ గురించి కూడా శ్రీనిధి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రశాంత్ నీల్ తనకు సోదరుడు లాంటి వాడని తెలిపింది. అతడు తనకు ఫ్రెండ్, మెంటార్ కాకుండా కొన్నిసార్లు తండ్రిగా కూడా ఎన్నో విలువైన సలహాలు ఇచ్చాడని శ్రీనిధి పేర్కొంది. కేజీఎఫ్ షూటింగ్ చివరి రోజు అయితే తాను టీమ్‌కు దూరం అవుతున్నందుకు కన్నీళ్లు పెట్టుకున్నట్లు వివరించింది.

కాగా కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన శ్రీనిధి 1992, అక్టోబర్ 21న జన్మించింది. బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చదువుతో పాటు మోడలింగ్‌లోనూ రాణించింది. మిస్ కర్ణాటక 2015 టైటిల్‌తో పాటు 2016లో మిస్ దివా సూపర్ నేషనల్ విజేతగా నిలిచింది. అలా కేజీఎఫ్ అవకాశం వచ్చింది. ఈ మూవీ తర్వాత శ్రీనిధికి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న కోబ్రా సినిమాలో ఆమె నటిస్తోంది.
Also Read:Modi Jammu Tour: జమ్మూలోని ‘పల్లి’ ప్రత్యేకత ఏంటి..? ప్రధానికి ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు..?
Recommended Videos:


