Negative propaganda against Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చాలా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయనకున్న క్రేజ్ మరే స్టార్ హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఆయన ముందుకు సాగుతూ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు… ఇక ఇంతకుముందు ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు తనకి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమాతో ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి మంచి గుర్తింపైతే లభించింది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించబోతున్నాం అంటూ కలర్ ఎగరేసి తిరుగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ట్రైలర్ మీద గాని పవన్ కళ్యాణ్ మీద గాని, ఈ సినిమా మీద కానీ చాలామంది నెగెటివ్ ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక రకంగా రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను ఎదురుకోలేని వారు మాత్రమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఇలాంటి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తున్నారంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
Also Read: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..కానీ ఇప్పుడు ఎన్టీఆర్,త్రివిక్రమ్ మూవీ లో హీరోయిన్..
మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరోసారి తన అభిమానులు ఆనందపడతారు. లేకపోతే మాత్రం ఆయన క్రేజ్ అనేది కొంతవరకు తగ్గిపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి సెప్టెంబర్ 25వ తేదీన ఓజీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
కాబట్టి రెండు నెలల గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటికే ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినప్పటికి ఈ సినిమా ఎలా ఉంటుంది సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ఛత్రపతి సినిమా నా వల్లే హిట్ అయింది… రాజమౌళి గారిది ఏం లేదు అంటున్న ప్రభాస్..వైరల్ వీడియో…
గత నాలుగు సంవత్సరాల క్రితం క్రిష్ (Krish) డైరెక్షన్లో మొదలైన ఈ సినిమా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ముగియడం అనేది కొంతవరకు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినప్పటికి ట్రైలర్ చూసిన తర్వాత జ్యోతి కృష్ణ కూడా ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…