NTR-Trivikram Movie Heroine: ఎన్టీఆర్(Junior NTR),త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్ లో కార్తికేయ స్వామి జీవితంలోని ఒక ముఖ్యమైన ఘట్టం మీద , భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కబోతుంది అనే ప్రకటన వచ్చిన వెంటనే సోషల్ మీడియా మొత్తం ఎలా ఊగిపోయిందో మనమంతా చూసాము. ఎన్టీఆర్ ప్రస్తుత లైనప్ లో ప్రశాంత్ నీల్ చిత్రం కంటే ఈ చిత్రానికే ఎక్కువ బజ్, హైప్ క్రియేట్ అయ్యింది. ఎప్పుడు షూటింగ్ మొదలు కాబోతుందో కూడా తెలియని ఈ సినిమా పై ఇంత క్రేజ్ ఏర్పడడం సాధారణమైన విషయం కాదు. ఈ చిత్రం అల్లు అర్జున్ నుండి ఎన్టీఆర్ కి షిఫ్ట్ అయ్యింది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ కార్తికేయ స్వామి క్యారక్టర్ లో ఇమిడిపోవడానికి ఇప్పటి నుండి కసరత్తులు మొదలు పెట్టాడు. రీసెంట్ గా ముంబై విమానాశ్రయం లో తళుక్కుమని మెరిసిన ఎన్టీఆర్ చేతిలో ‘మురుగన్’ అనే పుస్తకం కనిపించడం పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.
ఎన్టీఆర్ ఇప్పటి నుండే కసరత్తులు మొదలు పెట్టాడురోయ్ అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేశారు. ఇకపోతే నిన్న మొన్నటి నుండి ఈ చిత్రం లో విలన్ రోల్ కోసం రానా దగ్గుబాటి(Rana Daggubati) ని సంప్రదించినట్టు , ఆయన కూడా ఈ సినిమా చేయడానికి సుముఖత చూపించినట్టు వార్తలు వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కి కూడా ఫిక్స్ అయ్యినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ప్రముఖ మలయాళం టాప్ హీరోయిన్ మంజిమ మోహన్(Manjima Mohan) ఈ సినిమాలో నటించబోతుంది అంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఈమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఆనంద్ బాలసుబ్రమణ్యం రాసిన ‘ది లార్డ్ ఆఫ్ వార్..ది గాడ్ ఆఫ్ విస్డం’ అనే పుస్తకాన్ని తన స్టోరీ లో అప్డేట్ చేసింది.
Also Read: మహేష్ బాబు ను పక్కన పెట్టిన ఆ స్టార్ డైరెక్టర్…కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు…
కార్తికేయ స్వామినే ది లార్డ్ ఆఫ్ వార్ అని పిలుస్తూ ఉంటారు. ఆ పుస్తకాన్ని ఈమె తన స్టోరీ లో షేర్ చేసిందంటే కచ్చితంగా ఈ చిత్రం లో ఆమె నటించబోతుంది అని అభిమానులు ఒక నిర్ధారణకు వచ్చేసారు. మంజిమ మోహన్ మలయాళం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2015 వ సంవత్సరం లో ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వరుసగా మలయాళం లో సినిమాలు చేస్తూ వచ్చిన మానిజమ మోహన్, మన తెలుగు లో నాగ చైతన్య హీరో గా నటించిన ‘సాహసమే ఊపిరిగా సాగిపో’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి క్యారక్టర్ లో నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో నటించబోతుంది. అయితే ఆమె ఏ క్యారక్టర్ చేస్తుంది అనే దానిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.