Who is Niharika NM: మనలో చాలామంది ఏదో ఒకటి చేసి ఫేమస్ అయిపోవాలని చూస్తుంటారు… కానీ ఏం చేయాలో అర్థం కాదు… మనకి ఎందులో టాలెంట్ ఉంది అనే విషయాన్ని కనుక్కొని దాన్ని నలుగురు మెచ్చేలా ఎలా ప్రజెంట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి… మనం ఏదైనా చేయగలం అంటూ దృఢంగా నిశ్చయించుకొని ముందుకు సాగితే మన వల్ల కానిదేది ఉండదు…సంకల్పాన్ని మించిన గెలుపు లేదు…భయాన్ని మించిన ఓటమి లేదు…మన కష్టంతో, అలుపెరుగని పోరాటం చేసి ఒక్కసారి సెలబ్రిటి హోదాను సంపాదిస్తే చాలు లైఫ్ మొత్తం మారిపోతోంది… జనం మనల్ని చూసే మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతోంది. అందుకే ప్రతి ఒక్కరు వాళ్ళు చేస్తున్న పని మీద ఫోకస్ చేసి, చాలా ఎఫెక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతూ సెలబ్రిటీగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. ఒకప్పుడు సెలబ్రిటీలు అంటే సినిమా వాళ్ళు, క్రికెటర్లు, రాజకీయ నాయకులే ఉండేవారు.. కానీ సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వాళ్ళ టాలెంట్ ని చూపించుకుంటూ ఓవర్ నైట్ లో సెలబ్రిటీ హోదాను సంపాదిస్తున్నారు…
ఇక ఈ విషయానికి వస్తే నిహారిక ఎన్ ఎం ను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు… ఆమె తన మాటలతో ఫన్నీ వీడియోలను చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయింది… ప్రస్తుతం సినిమాల్లో కూడా నటించే స్థాయికి ఎదిగింది. దీని వెనుక నిహారిక కష్టం చాలా ఉందనేది వాస్తవం… అసలు నిహారిక ఎవరు? ఎక్కడ పుట్టారు? ఆమెకి ఎందుకంత ఫాలోయింగ్ వచ్చింది..?
నిహారిక ఎన్.ఎం 1997 వ సంవత్సరంలో జూలై 4వ తేదీన తమిళనాడులోని చెన్నైలో పుట్టింది… నిహారిక వాళ్ల అమ్మానాన్నలది విజయవాడ కానీ జాబ్ నిమిత్తం వాళ్ళు చెన్నై కి వెళ్లారు. అక్కడే నిహారిక జన్మించింది… ఇక తను పెరిగింది మాత్రం బెంగళూరు… ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న తెలుగులో మాట్లాడుతుండడం వల్ల తెలుగు భాష మీద బాగా పట్టునైతే సంపాదించింది… చిన్నప్పుడు స్కూల్లో పుస్తకాలలో ఉన్నది చదువుకొని ఎగ్జామ్స్ రాయడం అనేది ఆమెకు చాలా చిరాకు పుట్టించేదట…ఏదైనా కొత్తగా చేయాలని అనుకునేది కానీ అప్పుడు ఆమెకు అందుబాటులో పెద్దగా టెక్నాలజీ లేకపోవడం వల్ల అలాగే ఇంట్లో చదువు మీద ప్రెజర్ పెట్టడంతో చదవక తప్పలేదట. ఇక చిన్నప్పుడు తను చాలా లావుగా ఉండేదట, సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని ఉండడంతో చాలామంది తనను బాడీ షేమింగ్ చేసేవారట. వాళ్ళ మాటలను తట్టుకోలేక నిహారిక ఇంటికి వచ్చి ఒంటరిగా కూర్చుని ఏడ్చేదట…
ఇక అప్పటి నుంచి ఆమె లైఫ్ లో ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకుందట… మొత్తానికైతే తను సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోస్ చేసి పాపులర్ అయింది. ఆ వీడియోస్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.బ్రేకప్ లవర్స్ మీద ఆమె చేసిన వీడియో ఆమెకు గొప్ప పేరుని తీసుకొచ్చింది. రెండు నెలల్లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని తీసుకొచ్చిందంటే ఆమె చేసిన ఆ వీడియో ఎంత పాపులారిటిని సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు… అలాగే లిఫ్ట్ వెళ్లేటప్పుడు ఎవరెవరి మెంటాలిటీ ఎలా ఉంటుంది ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటారు.
వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ తో సహా చెబుతూ కొన్ని వీడియోలు చేసింది అవి ఆమెకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. మొత్తానికైతే ఆమె యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా టాప్ లెవల్ కి వెళ్ళింది… ఇక అమెరికాలో ఎంబీఏ చేసే టైంలో లాక్ డౌన్ రావడం తను ఒంటరిగా ఉండలేక వీడియోస్ చేస్తూ భారీ పాపులారిటిని సంపాదించుకుంది. తను ఖాళీ సమయం ఉన్న ప్రతిసారి వీడియోలను చేస్తూ వచ్చింది.
ఆ వీడియో ల ద్వారా ఆమె ఎంత పాపులర్ అయింది అంటే మహేష్ బాబు, అజయ్ దేవగన్, యశ్ లాంటి స్టార్ హీరోలు సైతం తమ సినిమాని ఆమె ద్వారా ప్రమోట్ చేస్తే ప్రేక్షకుల్లోకి వెళ్తుందనే ఉద్దేశ్యంతో ఆమె తో వీడియోలు చేయడానికి ఆమె డేట్స్ ని తీసుకొని ఆమె కోసం వెయిట్ చేశారు. ఆమె ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్ కన్నడ, హిందీ లాంగ్వేజ్ లను మాట్లాడుతోంది. ఏ భాషలో మాట్లాడితే ఆమె సొంత భాష అదే అనేంత రేంజ్ లో చాలా బీట్ గా క్లియర్ గా మాట్లాడుతూ ప్రేక్షకులను మెప్పిస్తోంది… అంతర్జాతీయ స్థాయిలో యూట్యూబ్ వాళ్ళు నిర్వహించిన ‘క్రియేటర్ ఫర్ చేంజ్’ అనే ఈవెంట్ కి వరుసగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది…
ఇక ప్రస్తుతం ఆమె ప్రియదర్శి మెయిన్ లీడ్ లో వచ్చిన ‘మిత్రమండలికి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఆమె పాత్రకి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. ప్రస్తుతం ఆమెకి ఇన్ స్టా లో 19 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు…ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు, హీరోయిన్స్ సైతం ఇన్ స్టా లో ఆమె ను ఫాలో అవుతున్నారు…ఇక మిత్రమండలి సినిమా వల్ల వచ్చిన క్రేజ్ తో ఆమె మరికొన్ని సినిమాలకు సైన్ చేసినట్టుగా తెలుస్తోంది…
View this post on Instagram
View this post on Instagram