Raj Tarun : రాజ్ తరుణ్ ను లాగేసుకున్న మాల్వీ మల్హోత్రా ఎవరు? మాజీ లవర్ లావణ్య ఆరోపణల కథేంటి.?

Raj Tarun కానీ ఆమె వైఖరి నచ్చకపోవడంతోనే ఆమెను వదిలేసినట్టుగా కూడా చెబుతున్నాడు. ఈ కేసులో ఇక ముందు ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది...

Written By: NARESH, Updated On : July 5, 2024 6:24 pm

Malvi Malhotra in Raj Tarun - Lavanya love affair

Follow us on

Raj Tarun – Lavanya : సినీ నటుడు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు అంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అతని మీద లావణ్య అనే అమ్మాయి కంప్లైంట్ చేసింది. ఇంక మొత్తానికైతే పోలీసులు ఏం జరిగింది అనే విషయాన్ని ఆరా తీసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ లవర్ అని చెబుతున్న లావణ్య ‘తిరగబడరా సామి’ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్ ను తనకు దూరం చేసిందనే ఆరోపణలు చేస్తుంది.

అలాగే తనను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పిన రాజ్ తరుణ్ ను అసలు తనతో పాటు మాట్లాడకుండా చేసిందని, మాల్వీ మల్హోత్రా వల్ల తనకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె కంప్లైంట్ లో తెలియజేసింది. ఇక ఇదిలా ఉంటే అసలు మాల్వీ మల్హోత్రా ఎవరు ఆమెకు రాజ్ తరుణ్ కు సంబంధం ఏంటి అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం.

నిజానికి మాల్వీ మల్హోత్రా హిమాచల్ ప్రదేశ్ లో పుట్టింది. ముంబై లో చదువుకుంది. మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆమెకు అనుకోకుండా హిందీలో 2017 లో వచ్చిన ‘ఉడాన్ ‘ అనే సీరియల్ లో అవకాశం వచ్చింది. ఇక దాని ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక అక్కడ ఆమె నటనను చూసిన దర్శక నిర్మాతలు హిందీలోనే ఆమెకు ‘హోటల్ మిలన్’ అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఇక ఆ సినిమా అంత పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో అక్కడే ఒకటి రెండు సినిమాలను చేసింది.

అవి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇక అక్కడ అనుకున్న ఆఫర్స్ రాకపోవడంతో మలయాళం లో ‘అభ్యూహం ‘ అనే సినిమాను చేసింది. ఇక ఆ సినిమాతో కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు రావోకపోవడంతో ఏ ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్న ‘తిరగబడరా సామి ‘ అనే సినిమా లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక ఇదే అనేకు మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. ఇక ఆ సినిమాలో హీరోగా చేస్తున్న రాజ్ తరుణ్ కి ఆమెకి మంచి పరిచయం ఏర్పాడంతో ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది.

ఇక అప్పటి నుంచి వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక అంతకుముందే లావణ్య తో ప్రేమ వ్యవహారం నడిపిన రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పినట్టుగా ఆమె తెలియజేస్తుంది. ఇక మాల్వీ మల్హోత్రా రావడంతో తనను పక్కన పెట్టేసి ఆమెతోనే రాజ్ తరుణ్ ఉంటున్నాడని ఆమె మోజులో పడ్డాడని లావణ్య ఆరోపిస్తుంది. రాజ్ తరుణ్ కూడా లావణ్యతో 2017 కు ముందు లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టుగా తెలియజేశాడు. కానీ ఆమె వైఖరి నచ్చకపోవడంతోనే ఆమెను వదిలేసినట్టుగా కూడా చెబుతున్నాడు. ఈ కేసులో ఇక ముందు ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది…