Lavanya-Malvi Malhotra: రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ తనను వదిలేశాడంటూ ఆరోపణలు చేస్తున్న లావణ్య సంచలన ఆడియో కాల్ రికార్డింగ్ విడుదల చేసింది. ఆ ఆడియోలో లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం నడిచింది.కాగా లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసింది. సదరు ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడించింది.
లావణ్య కథనం ప్రకారం… రాజ్ తరుణ్ ఆమెతో 11 ఏళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఉంది. ఓ గుడిలో వివాహం కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. ఆమెకు దూరంగా ఉంటున్నాడు. మరొక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ ఆమెను వదిలించుకోవాలని అనుకుంటున్నాడు.
తన జోలికి రావద్దని లావణ్యను బెదిరించాడు. చంపి,శవం మాయం చేస్తాను అన్నాడు. రాజ్ తరుణ్ ఆమెను డ్రగ్ కేసులో ఇరికించాడట. ఆ కేసులో 45 రోజులు లావణ్య జైలులో ఉన్నారట. అప్పుడు కూడా తనను రాజ్ తరుణ్ పట్టించుకోలేదని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ తనకు కావాలంటున్న లావణ్య, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. నార్సింగ్ పోలీసులు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
లావణ్య ఆరోపణలను రాజ్ తరుణ్ ఖండిస్తున్నారు. ఆమెతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే కానీ… విడిపోయి చాలా కాలం అవుతుంది. డ్రగ్స్ తీసుకుని నన్ను టార్చర్ పెట్టింది. బ్లాక్ మెయిల్ చేసిందని వివరణ ఇచ్చాడు. లీగల్ గానే ఈ కేసును ఎదుర్కొంటానని అన్నాడు. రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపిస్తున్న హీరోయిన్ మాల్వి మల్హోత్రా. ఆమె రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ తిరగబడరసామీ చిత్రంలో నటించింది.
కాగా గతంలో మాల్వి మల్హోత్రా-లావణ్య మధ్య మొబైల్ లో మాటల యుద్ధం జరిగింది. ఈ ఆడియో సంభాషణ లావణ్య తాజాగా విడుదల చేశారు. సదరు ఆడియోలో.. రాజ్ తరుణ్ ని వదిలేయ్, నీ కాళ్ళు పట్టుకుంటానని లావణ్య హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో అంటున్నారు. రాజ్ తరుణ్ నీతో రిలేషన్ పెట్టుకున్నాక నన్ను వదిలేశాడు. నువ్వు ఏం చెబితే అది చేస్తున్నాడు. నా మొబైల్ నెంబర్ బ్లాక్ చేస్తున్నాడని లావణ్య ఆమెతో అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు కెరీర్లో ఎదగలేరని మాల్వి మల్హోత్రాను లావణ్య హెచ్చరించింది. ఈ ఆడియో రికార్డు వైరల్ అవుతుంది..