Srisailam: శ్రీశైలంలో మరో అద్భుతం వెలుగులోకి..

శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి యాఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సిసి రోడ్ సపోర్ట్ వాల్ నిర్మాణానికి జెసిబి తో చదును చేస్తుండగా ఈ శివలింగం బయటపడినట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : July 5, 2024 6:53 pm

Srisailam

Follow us on

Srisailam: ఎన్నో జన్మల పుణ్యఫలం శ్రీశైలం దర్శనమంటారు పండితులు. దేశంలో పురాతన శైవ క్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కొండల మధ్య జ్యోతిర్లింగ స్వరూపిడిగా వెలిశాడు శంకరుడు. నిత్యం పంచాక్షరి మంత్రంతో మార్మోగుతుంది ఈ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలంలో అణువణువు వ్యాపించి ఉంటుందని పురాణాల్లో చెబుతాయి. అందుకే భక్తులు శ్రీశైలం సందర్శనకు ఇష్టపడతారు. అటువంటి శాస్త్రం శ్రీశైలంలో మరో పురాతన శివలింగం బయటపడింది.

శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి యాఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సిసి రోడ్ సపోర్ట్ వాల్ నిర్మాణానికి జెసిబి తో చదును చేస్తుండగా ఈ శివలింగం బయటపడినట్లు తెలుస్తోంది. అదే రాయిపై నంది విగ్రహం కూడా ఉంది. మరోవైపు శివలింగం పక్కనే రాయిపై తెలియని లిపితో రాసి ఉన్న గుర్తులు ఉన్నాయి. దీంతో దానిని బయటకు తీసిన అధికారులు పురావస్తు శాఖకు పరిశీలనకు పంపారు. దీనిపై అధ్యయనం చేసిన పురావస్తు శాఖ అధికారులు 14,15 వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపి గా గుర్తించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధ దేవుని శిష్యుడైన కంపిలయ్య శివలింగాన్ని చక్ర గుండం వద్ద ప్రతిష్టించినట్లు లిపిలో ఉన్నట్లు వెల్లడించారు.

మనదేశంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీశైలం. శ్రీశైలం మల్లికార్జునం అంటూ భ్రమరాంబికా సతీ హృదయం ప్రస్తుతి కనిపిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆదిపరాశక్తికి నవమ రూపంగా భ్రమరాంబను ఆరాధించడం పరమ పవిత్రంగా భావిస్తారు. లక్షా నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. 8 శృంగాలతో అలరారే శ్రీశైలంలో 44 నదులు, 60 కోట్ల తీర్థ రాజాలు, పరాసర, భరద్వాజది మహర్షుల తపోవన సీమలు, చంద్ర కుండ, సూర్య కుండాది పుష్కరిణులు, స్పర్శ వేదులైన లతలు, వృక్ష సంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు ఉన్నాయని ప్రతీతి. అటువంటి శ్రీశైలంలో ప్రతిదీ మహాభాగ్యమే. ఇప్పుడు శతాబ్దాల కిందట శివలింగం బయటపడడం శివ మహత్యం అని భక్తులు నమ్ముతున్నారు.