Marital Troubles: శృంగారం బంగారం కంటే విలువైనదని నిపుణుల అభిప్రాయం. సెక్స్ తో చాలా రోగాలు దూరమవుతాయని వైద్యులు కూడా సూచిస్తున్నారు. తరచుగా సంభోగం లేకపోతే చాలా కష్టాలు వస్తాయని చెబుతున్నారు. అందుకే ప్రతి నిత్యం కాకపోయినా కనీసం వారానికోసారైనా రతి క్రీడ జరిపితే మనసు కుదుట పడుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇందుకు గాను సెక్స్ ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరి అయిన కార్యంగా చెబుతున్నారు. సృష్టి రహస్యానికి ప్రధాన కారకంగా ఉండే రతిని అందరు తనివితీరా ఆస్వాదించాల్సిందే.
శృంగారంలో పాల్గొనకపోతే దంపతుల మధ్య ప్రేమ చిగురించదు. ఎడం పెరుగుతుంది. ఫలితంగా వారి విడాకులకు కూడా ఓ కారణంగా మారుతుంది. అందుకే దంపతుల్లో ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావివ్వకుండా ఉండాలంటే రతి జరపడమే పరిష్కారం. లేకపోతే దంపతుల మధ్య కోపం పెరుగుతుంది. ఒకరిపై మరొకరు అరుచుకోవడం తిట్టుకోవడం వంటి పనులు చేస్తూ నలుగురిలో చులకన అవడం ఖాయం. అందుకే వీలైనంత వరక దంపతుల మధ్య కోపం రాకుండా చూసుకోవడమే అసలైన మార్గం.
Also Read: Kapu Welfare: ఏపీలో ‘కాపు’ సంక్షేమానికి మంగళం.. ఆ లెక్కలతో సరిపెడుతున్న జగన్ సర్కారు
దంపతుల మధ్య సెక్స్ సంబంధం లేకపోతే అనుమానాలకు కారణమవుతుంది. దీంతో ఇద్దరి మధ్య డిప్రెషన్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. చీటికి మాటికి ఇద్దరి మధ్య కేకలు పుట్టుకొస్తాయి. చిన్న విషయాలకు కూడా ఇద్దరి మధ్య తగవులు పెరుగుతాయి. ఈనేపథ్యంలో దంపతులకు కష్టాలు తప్పవు. అందుకే వారి మధ్య ఎడం పెరగకుండా ఉండాలంటే శారీరక సంబంధమే ప్రధాన పరిష్కారంగా కనుగొన్నారు. ఆలుమగల మధ్య మంచి స్నేహసంబంధం ఉండాలంటే కూడా సెక్సే ప్రధానం అని గుర్తించాలి.
కాపురం సజావుగా సాగాలంటే ఇద్దరి మధ్య విశ్వాసం ఉండాలి. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. అలా భార్యాభర్తల మధ్య అవినాభావ సంబంధానికి సంభోగమే ప్రధాన ద్వారంగా తెలుసుకోవాలి. ఆలుమగల మధ్య అనుమానాలు రాకుండా ఉండాలంటే కూడా అదే చక్కనైన మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఒకసారైనా సెక్స్ లో పాల్గొంటే రోగాలు కూడా దరిచేరవని రుజువైంది. దీనికి ప్రతి ఒకరు గుర్తించి సెక్స్ కోసం దంపతులు తపించడంలో తప్పులేదని చెబుతున్నారు.
Also Read: ‘Thank you’ 7 Days Collections: ‘థాంక్యూ’ 7 డేస్ కలెక్షన్స్.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు !
Recommended Videos