Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నైతే క్రియేట్ చేసుకున్నాడు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడంలో ఆయన చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు…ఇక ఇప్పటివరకు తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి అల్లుఅర్జున్ కి సెపరేట్ క్రేజ్ అయితే ఉంది.
ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ స్టార్ హీరో అవ్వడంలో ఇద్దరు దర్శకులు మాత్రం చాలా వరకు ఆయనకు హెల్ప్ చేశారు. ఇక వాళ్లతో చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా అల్లు అర్జున్ స్టాండర్డ్ ను పెంచిన దర్శకులు కూడా వాళ్లే కావడం విశేషం…ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ ది బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి.
ఇక వీళ్లతో పాటుగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ కి కూడా చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి వీళ్లిద్దరూ కలిసి అల్లు అర్జున్ ను స్టార్ గా మార్చారు. సుకుమార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2, పుష్ప, పుష్ప 2 సినిమాలు వచ్చాయి. వీటిలో అన్ని సినిమాలు మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా నిలబెట్టిన దర్శకుడు కూడా సుకుమార్ గారే కావడం విశేషం…
త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో అనే సినిమాలు వచ్చాయి. ఇక ఈ మూడు సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. దాంతో ఇక వీళ్ళ కాంబినేషన్ లో నాలుగో సినిమా కూడా రావడానికి సిద్ధం అవుతుంది…ఇక వీళ్లిద్దరూ దర్శకులు కలిసి అల్లు అర్జున్ కి గొప్ప స్థానాన్ని అయితే తీసుకొచ్చి పెట్టారు. మరి వీళ్ళలో ఎవరిది బెస్ట్ కాంబినేషన్ అంటే కరెక్ట్ గా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితులు అలాగే మంచి సక్సెస్ లను అందించిన దర్శకులు కూడా కావడం విశేషం…