Director Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లు చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించారు. కానీ కొంతమందికి మాత్రమే ఇక్కడ ఎక్కువ సంవత్సరాలపాటు కెరియర్ ఉంటుంది. ముఖ్యంగా సుకుమార్ లాంటి దర్శకుడు అటు సినిమాలతో సక్సెస్ లను సాధిస్తూనే, తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన అసిస్టెంట్లను సైతం ప్రోత్సహిస్తూ వాళ్లను సైతం దర్శకులుగా మార్చడానికి చాలా వరకు హెల్ప్ చేస్తున్నాడు.ఇండస్ట్రీ లో దర్శకుడిగా అవకాశం రావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్నో సంవత్సరాలపాటు నిరీక్షణ తర్వాత అవకాశం ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. కానీ వాళ్ళ టాలెంట్ తో దాన్ని పట్టుకొని మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఇక ఆ దర్శకుడికి తిరుగుండదు…
సుకుమార్ మాత్రం తన టీం లో ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్లకు డైరెక్షన్ చేసే అవకాశం అందిస్తుంటాడు. అందుకే అతను టాప్ పొజిషన్లో ఉండటమే కాకుండా తన శిష్యులను సైతం టాప్ పొజిషన్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా ఇండస్ట్రీలో తన శిష్యులకు అవకాశాలు రావడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది అతని శిష్యులే ఉండడం విశేషం… సినిమాలు ఎవరైనా తీస్తారు బాస్.. కానీ తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసే వాళ్లను డైరెక్టర్లుగా చేయాలని కొందరు మాత్రమే అనుకుంటారు.
అందులో సుకుమారు ఒకరు. అందుకే అతను ఈతరం డైరెక్టర్స్ లలో ఒక గొప్ప స్థాయికి వెళ్లాడనే చెప్పాలి. మొత్తానికైతే సుకుమారు ను మించిన దర్శకులు ఎంతమంది వచ్చినా కూడా అతని వ్యక్తిత్వాన్ని మించిన వారు మాత్రం రారు రాలేరనే చెప్పాలి…అందుకే ఇప్పుడు చాలామంది సుకుమార్ దగ్గర ఒక సినిమా చేసిన చాలు తమకున్న టాలెంట్ ని అక్కడ ప్రూవ్ చేసుకుంటే సుకుమారే వాళ్ళని డైరెక్టర్స్ గా పరిచయం చేస్తాడు.
Also Read: పూరి జగన్నాథ్ సినిమాలోని ఆ క్యారెక్టర్ ను తీసుకొనే రాజమౌళి ఆ సూపర్ హిట్ మూవీ చేశాడా..?
కాబట్టి చాలామంది అతని దగ్గర శిష్యులుగా జైన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు… ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రానటువంటి గుర్తింపు సుకుమార్ సినిమాలో చేస్తే వస్తుందనే ఉద్దేశ్యంతో చాలా మంది అతని సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు…