Mohan Babu and Manoj : సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించగలిగే సత్తా ఉన నటుడు మోహన్ బాబు…ఆయన కెరియర్ మొదట్లో విలన్ గా నటించినప్పటికి ఆ తర్వాత హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబు తనదైన రీతిలో సక్సెస్ లను అందుకున్నాడు. ఇక తన కొడుకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికి వాళ్ళు అంత పెద్ద సక్సెస్ లను అయితే సాధించలేకపోయారు. ఇక ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీలో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు మా మధ్య గొడవలు ఏమీ లేవు మేమంతా కలిసి ఉంటున్నాం అంటూ క్లారిటి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఎట్టకేలకు నిన్న మంచు మనోజ్ కి మోహన్ బాబు కి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక అది గొడవతో మాత్రమే ఆగకుండా మంచు మనోజ్ పైన మోహన్ బాబు తన అనుచరుడు అయిన వినయ్ తో దాడి చేయించినట్టుగా కూడా తెలుస్తోంది. అనంతరం టిఎక్స్ హాస్పిటల్ కి వచ్చిన మనోజ్ కి వైద్య సేవలను నిర్వహించిన డాక్టర్లు సిటీ స్కాన్ తో పాటు అన్ని రకాల టెస్ట్ లను నిర్వహించి అతనికి కాలు మీద, మెడ దగ్గర కొన్ని లోతైన గాయాలు అయినట్టుగా గుర్తించారు. ఇక ఈ విషయాన్ని ఆ డాక్టర్లు పోలీసులకు కూడా తెలియజేయడం విశేషం.. ఇక దాంతో పాటుగా మనోజ్ మోహన్ బాబు పైన కేసు పెట్టడంతో మోహన్ బాబు కూడా మనోజ్ పైన దాడి చేశాడని కేసు పెట్టాడు…ఇక ఏది ఏమైనా కూడా మంచు ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు జరగడం అనేది వాళ్ళ అభిమానులతో పాటు, సగటు ప్రేక్షకులను కూడా కొంతవరకు బాధకు గురిచేస్తుందనే చెప్పాలి. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా కూడా వీళ్ళు హడావిడి చేస్తూ కనిపించేవారు. ఒకరంటే ఒకరికి చాలా అమితమైన ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయంటూ చెప్పుకునే మోహన్ బాబు ఇలా తన కొడుకు మీద దాడి చేయించడం సరైనదేనా అంటూ కొంతమంది విమర్శలైతే చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతానికి టిఎక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మనోజ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే వీళ్ళ ఫ్యామిలీ లో గత కొన్ని రోజుల నుంచి ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. వాటి వల్లే ఈ గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది…
ఇక ప్రస్తుతం మనోజ్ హీరోగా కాకుండా కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటిస్తూ తన రెండోవ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఫ్యామిలీ గొడవలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక ఇంతకు ముందు కూడా మంచు విష్ణు తనని కొట్టడానికి తన ఇంటి మీదకి వచ్చిన ఒక వీడియోని అప్పట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే అది నిజమైన వీడియో కాదని ప్రాంక్ చేశామంటూ మంచు విష్ణు తర్వాత క్లారిటీ ఇచ్చాడు. కానీ అప్పటినుంచే వీళ్ల మధ్య చాలా గొడవలు జరుగుతున్నట్టుగా ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది…