కామన్ పీపుల్ కు హీరో, హీరోయిన్లు అంటే ఇష్టం. ఫేవరెట్ స్టార్లుంటారు. కానీ అందరికీ కాదు. అయితే కామన్ పీపుల్ కు ఫేవరెట్ ఉండడం కామన్. కానీ హీరోయిన్లకు కూడా హీరోలంటే ఇష్టం ఉంటుంది. వాళ్లు కూడా స్టార్లే అవడం విశేషం. అయితే హీరోయిన్లు కూడా ఇతర హీరోలపై అభిమానాన్ని పెంచుకుంటారు. చాలా సార్లు తనతో నటించిన హీరోలనే ఫేవరెట్ అని చెబుతుంటారు. అంటే.. ఏ హీరోతో నటిస్తుంటే ఆ హీరోను ఫేవరెట్ అని హీరోయిన్లు చెప్పడం మనం గతంలో చాలా సార్లు చూశాం. కొన్ని సార్లు మనసుకు నచ్చిన హీరో పేరును కూడా బయటపెడుతుంటారు. మరీ మన స్టార్ హీరోయిన్ లు అభిమానించే ఆ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి చూసేద్దామా…
శ్రీలీల.. నందమూరి బాలకృష్ణ అంటే శ్రీలీలకు చచ్చేంత ఇష్టమట. తాను మొదటి నుంచి బాలయ్యకు వీరాభిమానిని అని గతంలోనే తెలిపింది. రీసెంట్ గా ఆయనతో భగవంత్ సింగ్ కేసరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలా ఆయనను దగ్గర ఉండి గమనించడం, ఆయన వ్యక్తిత్వం చూసి మరింత అభిమానం పెరిగిందట. టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు సంపాదించిన శ్రీలీల ఎలాంటి అవకాశాలను అందుకుంటూ దూసుకొని పోతుందో తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్నో సినిమాల్లో నటించి తన ఖాతాలో హిట్ లను సొంతం చేసుకుంది. ఆమె ఖాతాలో బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి బడా హీరోలు ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
సాయి పల్లవి.. సాయి పల్లవికి ఏ హీరో అంటే ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో అడిగితే.. ముగ్గురు హీరోల గురించి తెలిపింది. అందులో ముందు వరసలో కమల్ హాసన్ ఉన్నారు. ఇక సూర్య, ముమ్మట్టి అంటే కూడా అభిమానం అని తెలిపింది సాయి పల్లవి. వీరిలో కమల్ హాసన్ అంటే మరీ ఇష్టమట. తన సినిమా పోస్టర్లు దాచుకుందట. అవి ఇప్పటికీ కూడా తన దగ్గరే ఉన్నాయని చెప్పింది సాయి పల్లవి. ఇక కమల్ హాసన్ సొంత బ్యానర్ లో గార్గీ సినిమా వచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.
సమంత.. ఎన్నో హిట్ లతో దూసుకుపోతున్న హీరోయిన్ సమంత. ఈమె తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంటుంది. ఈ అమ్మడుకు రన్ బీర్ కపూర్ అంటే ఇష్టమట. రన్ బీర్ అంటే తనకు ఎంతో ఇష్టమని..అతనికి జోడీగా నటించాలని ఉందని గతంలో సమంత తన మనసులోని కోరికను బయట పెట్టింది. ఆయనతో నటించే ఛాన్స్ వస్తే.. తప్పకుండా నటిస్తాను అని తెలిపింది. ఈ స్టార్ హీరోకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో సమంత కూడా ఉండడం విశేషం.
కాజల్.. కాజల్ అగర్వాల్ కు ఇద్దరు హీరోలు ఇష్టమని గతంలోనే తెలిపింది. అందులో ఒకరు అజిత్, మరొకరు విజయ్. గతంలో విజయ్ తో మూడు సినిమాల్లో నటించింది. ఇక అజిత్ తో వివేగం సినిమాలో నటించింది. ఈ ఇద్దరు హీరోలు తాను నటించే సమయంలో సౌమ్యంగా ఉండేవారని..స్త్రీలంటే వారికి ఎంతో గౌరవమని..తమ సహ నటీమణులతో స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపింది కాజల్. అలా ఇద్దరిని ఇష్టపడుతున్నానని తెలిపింది కాజల్. వివేగం సినిమా షూటింగ్ సమయంలో అజిత్ అంకితభావం నచ్చిందట. దీంతో ఆయన ఆ స్థాయికి ఎలా చేరుకున్నారో అర్థం అయింది అని తెలిపింది. అంతేకాదు అజిత్ మానవత్వం కాజల్ ను కదిలించింది అని తెలిపింది కూడా. విజయ్ సెట్స్ లోకి అడుగుపెడితే ఆయన ఆ సినిమా గురించి తప్ప మరో విషయం మాట్లాడరట. నటనలో సహజత్వం నచ్చిందట. అయితే ఎన్నో సినిమాల్లో నటించినా ఎవరి ప్రస్తావన తీసుకురాలేదు కాజల్. కానీ వీరిద్దరిపై ఉన్న అభిమానాన్ని మాత్రం చాటుకుంది.
శృతిహాసన్.. కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తన తండ్రి పేరును వాడకుండానే ఎదిగింది. తన నటనతో ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుంది. అందరికంటే ఎక్కువ ప్రభాస్ అని తెలిపింది. షూటింగ్ లొకేషన్ లో ప్రభాస్ అందరిని రిసీవ్ చేసుకునే విధానం, ఆయన లొకేషన్ లో ఉన్నవారికి ఫుడ్ తీసుకురావడం, అందరితో ఎంతో చనువుగా మూవ్ అవడం తనకు నచ్చుతాయని తెలిపింది. బాహుబలి రేంజ్ హిట్ ఉన్నా.. కూడా అందరితో క్లోజ్ గా మూవ్ అవుతారట. అందుకే తన ఫేవరెట్ కోస్టార్ అయ్యారని శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఇక రష్మికకు చాలా మంది హీరోలంటే ఇష్టం.. ముఖ్యంగా విజయ్ దేవరకొండతోపాటు అల్లు అర్జున్, రణ్ బీర్ కపూర్ లు అంటే ఇష్టమట.. వీరందరితోనే తనకు బ్రేక్ రావడంతో ఆ హీరోలు ఇష్టమని చెబుతోంది.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Who are the favorite heroes of samantha kajal srileela shruti haasan and rashmika
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com