https://oktelugu.com/

Bigg Boss Telugu 8: కావ్య ని తలచుకొని ఏడ్చేసిన నిఖిల్..బయటకి వెళ్లిన తర్వాత మళ్ళీ కలిసిపోతాను అంటూ కామెంట్స్!

నిఖిల్ కి కావ్య అనే టీవీ సీరియల్ హీరోయిన్ తో రిలేషన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఈ జంట సోషల్ మీడియా లో పెద్ద పాపులర్. వీళ్లకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉండేది. ఎన్నో వీడియోస్ కూడా చేసేవారు, అదే విధంగా స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షోలో వీళ్లిద్దరు కలిసి పాల్గొనేవారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 17, 2024 / 08:50 AM IST

    Nikhil Love Story

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో బాగా పాపులర్ అయిన లవ్ స్టోరీస్ లో ఒకటి నిఖిల్ – యష్మీ జంటది. నిఖిల్ వైపు నుండి యష్మీ కి ఎలాంటి పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వలేదు కానీ, యష్మీ మాత్రం నిఖిల్ ని చాలా ఇష్టపడింది. మొదటి 5 వారాలు ఆడపులి లాగ గేమ్స్ లో విర్జృభించిన యష్మీ,ఆ తర్వాత నిఖిల్ కి క్లోజ్ అయ్యాక తన గేమ్ ని తగ్గించుకుంటూ వచ్చింది. నిఖిల్ కి పరోక్షంగా చాలా సార్లు ప్రపోజ్ చేసింది. నిఖిల్ అంచనాలు పెంచుకోవద్దు అని యష్మీ కి పదే పదే చెప్పేవాడు. కానీ యష్మీ మాత్రం నిఖిల్ ని వదలలేదు. అతని సంతోషం కోసం ఈమె 7 వ వరం నుండి తన కోసం కాకుండా, నితిన్ కళ్ళలో ఆనందం చూడడం కోసం గేమ్ ఆడేది. దీంతో టాప్ 5 లో ఉండాల్సిన ఆమె, ఇప్పుడు ఎలిమినేషన్ లోకి దగ్గర్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నేడు యష్మీ కి పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చేసాడు నిఖిల్.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే నిఖిల్ కి కావ్య అనే టీవీ సీరియల్ హీరోయిన్ తో రిలేషన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఈ జంట సోషల్ మీడియా లో పెద్ద పాపులర్. వీళ్లకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉండేది. ఎన్నో వీడియోస్ కూడా చేసేవారు, అదే విధంగా స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షోలో వీళ్లిద్దరు కలిసి పాల్గొనేవారు. అయితే వీళ్లిద్దరికీ బ్రేకప్ జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే. నేడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి తమ బ్రేకప్ లవ్ స్టోరీస్ గురించి చెప్పుమనగా, దానికి నిఖిల్ కావ్య ని తలచుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను సినీ ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఆమెని చూసిన వెంటనే నా మనిషి అని అనిపించింది. ఈ నవంబర్ 22వ తేదికి మా రిలేషన్ మొదలై ఆరేళ్ళు అవుతుంది’ అని అంటాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడు మేము విడిపోయామా లేదా అంటే, నా దృష్టిలో ఆమెతో నాకు ఉన్న బాండ్ ని మర్చిపోలేక నేను విడిపోలేను. భవిష్యత్తులో నా జీవితంలోకి వేరే అమ్మాయి వచ్చినా రాకపోయినా, కావ్యతో ఉన్న నిఖిల్ మళ్ళీ రాలేడు. కచ్చితంగా ఈ షో అయ్యాక ఆమె వద్దకు వెళ్తాను, నన్ను తిడుతుంది, అయిన భరిస్తాను, ఎలా అయినా ఆమెతో ప్యాచప్ చేసుకుంటాను’ అని చెప్తాడు నిఖిల్. ఇదంతా విని యష్మీ కూడా ఎమోషనల్ అవుతుంది. ఈ విషయం నిఖిల్ ఇప్పటి వరకు ఆమెకి చెప్పలేదు. ఒకవేళ చెప్పి ఉండుంటే యష్మీ అతని చుట్టూ తిరిగేది కాదు , తన గేమ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేది. ఇప్పుడు యష్మీ గేమ్ మొత్తం పాడు అవ్వడానికి కారణం నిఖిల్ అనే చెప్పాలి. అయితే కావ్యతో ప్యాచప్ అవుతాను అని నిఖిల్ నిజంగానే చెప్పాడా?, లేకపోతే ఆయన అమ్మ యష్మీ ని దూరం పెట్టు అని చెప్పింది కాబట్టి, ఆమని శాశ్వతంగా దూరం పెట్టడానికి ఇలా స్ట్రాటజీ గా చెప్పాడా అనేది తెలియాల్సి ఉంది.